AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E20 వాహనాలపై కేంద్రం పార్లమెంట్‌లో కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే..

E20 Fuel: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో ఎలాంటి ఇంజన్ వైఫల్యం ఫిర్యాదు లేకుండా నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో గత మూడున్నర సంవత్సరాలుగా..

E20 వాహనాలపై కేంద్రం పార్లమెంట్‌లో కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే..
E20 Fuel
Subhash Goud
|

Updated on: Jul 20, 2026 | 7:29 PM

Share

E20 పెట్రోల్‌కు సంబంధించిన వాహనాల పనితీరుపై తమకు ఎలాంటి నిరూపితమైన ఫిర్యాదులు అందలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొంది. దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా వాహనాల వాస్తవ వినియోగ అనుభవాన్ని, పలు అధ్యయనాలను ప్రభుత్వం ఉదహరించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలు చేసింది.

E20 ఇంధనం వాడకం వల్ల వాహనాలకు హాని జరగదు. ఇంజిన్ దెబ్బతినడం, సమస్యలు తలెత్తడం లేదా పనితీరు గణనీయంగా తగ్గడం వంటి వాటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: EPFO: పెళ్లి కోసం పీఎఫ్‌ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు..? ఇప్పుడు మరింత సులభం!

మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రభుత్వం మీడియా నివేదికలు, సోషల్ మీడియాలో వ్యక్తమైన ఆందోళనలపై శాస్త్రీయ అంచనాను నిర్వహించింది. దీర్ఘకాలిక ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయి ధృవీకరణ, నిజ జీవిత వినియోగదారుల అనుభవాల ఆధారంగా, వాహన పనితీరుపై E20కి నిరూపితమైన గణనీయమైన ప్రతికూల ప్రభావాలు ఏవీ లేవని నిర్ధారించింది.

దీనికి ప్రతిస్పందనగా, దేశంలో గత మూడున్నర సంవత్సరాలుగా E15+ బ్లెండ్ పెట్రోల్, రెండున్నర సంవత్సరాలకు పైగా E19-E20 ఇంధనం వాడుకలో ఉన్నాయని, అదే సమయంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ బ్లెండ్‌లతో నడుస్తున్నాయని తలిపింది.

ఇది కూడా చదవండి: Indian Railways: చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికుల భరతం పట్టే రైల్వే కొత్త రూల్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో ఎలాంటి ఇంజన్ వైఫల్యం ఫిర్యాదు లేకుండా నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: PIB Fact Check: నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా? కేంద్రం ప్రకటించిందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us