AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితుడిని‌ కలిసి వస్తానని వెళ్లాడు.. ఆ తర్వాత గ్రామ శివారులో..

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన కుడుకల శ్రీనివాస్‌ (40) ఇంటి నుంచి వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలించగా.. చెన్నూర్‌ మండలం సోమనపల్లి శివారులో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితుడిని‌ కలిసి వస్తానని వెళ్లాడు.. ఆ తర్వాత గ్రామ శివారులో..
Mancherial Suspicious Death
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 27, 2026 | 11:35 AM

Share

మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడం.. అనంతరం గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్‌ (40) ఈ నెల 20న స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి ఇంటి నుంచి మంచిర్యాలకు వెళ్లాడు. అయితే రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో బందువుల ఇళ్లలో గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో శ్రీనివాస్‌ ఆచూకీ కోసం నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్‌ అయిన రోజే రాత్రి సుమారు 8 గంటల సమయంలో చెన్నూర్‌ పట్టణంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర వైన్స్‌ వద్ద శ్రీనివాస్‌ కనిపించినట్లు సమాచారం. అక్కడ తన దూరపు బంధువు గోదరి సమ్మయ్యతో కలిసి మద్యం సేవించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత శ్రీనివాస్‌ ఎక్కడికి వెళ్లాడు..? ఎవరిని కలిశాడు..? ఏం జరిగింది..? అనే విషయాలు ప్రస్తుతం మిస్టరీగా మారాయి.

గ్రామ శివారులో మృతదేహం లభ్యం..

శ్రీనివాస్‌ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తుండగా.. తాజాగా శనివారం చెన్నూర్‌ మండలం సోమనపల్లి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

శ్రీనివాస్‌ మృతికి అసలు కారణం తెలుసుకునేందుకు పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, మిస్సింగ్‌ ఫిర్యాదు వివరాలు, చివరిసారిగా శ్రీనివాస్‌తో ఉన్న వ్యక్తుల వివరాలు, అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!