AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PIB Fact Check: నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?

PIB Fact Check: మోదీ ప్రభుత్వం తీసుకునే మరో నిర్ణయంతో 11 కోట్ల టీవీలు మూతపడతాయి. ఇప్పటికే మొబైల్ ఫోన్ల కారణంగా కోట్ల టీవీలు మూతపడ్డాయి. టీవీ పరిశ్రమ తీవ్ర ప్రమాదంలో ఉంది. ప్రభుత్వం దానికి ఘోరమైన దెబ్బ కొట్టింది. అలాగే..

PIB Fact Check: నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
Dth
Subhash Goud
|

Updated on: Jul 20, 2026 | 7:14 PM

Share

PIB Fact Check: ఈ రోజుల్లో టీవీల నిలిపివేత వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో త్వరలో 11 కోట్ల టీవీలు మూగబోనున్నాయాని, దీనివల్ల టీవీ ప్రసారాలు గణనీయంగా ఖరీదైనవిగా మారతాయని ఒక వైరల్ పోస్ట్ పేర్కొంటోంది. దీని వెనుక అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో ఇలా ఉంది. “కేంద్ర ప్రభుత్వం తీసుకునే మరో నిర్ణయంతో 11 కోట్ల టీవీలు మూతపడతాయి. ఇప్పటికే మొబైల్ ఫోన్ల కారణంగా కోట్ల టీవీలు మూతపడ్డాయి. టీవీ పరిశ్రమ తీవ్ర ప్రమాదంలో ఉందని”, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జూన్ 12న కొత్త నిబంధనల ముసాయిదాను సమర్పించిందని, టీవీ ప్రసార, టెలికాం కంపెనీలకు ఏకరూప నిబంధనలు ఉంటాయని, ఈ ఏకరూప నిబంధనల ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన లైసెన్స్ ఫీజులు సమకూరుతాయని వైరల్ అవుతోంది.

దీని కారణంగా టీవీ ప్రసారాలు చాలా ఖరీదైనవిగా మారతాయని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు, కేబుల్ ఆపరేటర్లు తమ ఛార్జీలను నాలుగు నుంచి ఆరు రెట్లు పెంచుతారు. డిటిహెచ్, కేబుల్ టీవీలు కనుమరుగవుతాయి. ఒక్క దెబ్బతో టీవీ సేవలు నిలిచిపోవడమే కాకుండా, లక్షలాది మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతారంటూ ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అసలు నిజం ఏంటంటే..

కేబుల్, డీటీహెచ్ (DTH) ఛార్జీలు 4 నుంచి 6 రెట్లు పెరగనున్నాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ వార్తలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని PIB Fact Check (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) పూర్తిగా ఖండించింది. దేశంలో టీవీ సేవలను మూసివేసేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను అమలు చేయలేదని పీఐబీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో స్పష్టంగా పేర్కొంది.

టెలికమ్యూనికేషన్స్ (టెలివిజన్, రేడియో, సంబంధిత సేవలు) నియమాలు, 2026 ముసాయిదాను ఎంఐబి విడుదల చేసిందని, దీనిపై 2026 జూలై 27 వరకు ప్రజలు, భాగస్వాముల నుండి అభిప్రాయాలను కోరుతున్నారని పిఐబి కూడా రాసింది. ఈ ముసాయిదా నియమాలలో ఎలాంటి రుసుము పెంపునకు సంబంధించిన నిబంధన లేదు. టీవీ, రేడియో సేవల కోసం జారీ చేసిన వివిధ మార్గదర్శకాలను ఏకీకృతం చేయడమే ఈ నియమాల లక్ష్యం. ప్రస్తుత వ్యవస్థను సరళీకరించి, సమన్వయం చేయడం ద్వారా టీవీ, రేడియో ప్రసార రంగం సజావుగా పనిచేయడానికి వీలు కల్పించడం వీటి ఉద్దేశ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us