AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కొత్త బార్‌లకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికంగా హైదరాబాద్‌లోనే.. ఎన్నంటే?

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 41 కొత్త బార్ లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 14 బార్‌లు ఉన్నాయి. జనాభా ఆధారంగా బెసిక్ ఎక్సైజ్ టాక్స్ (BET) స్లాబ్‌లు నిర్ణయించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష రుసుముతో, అర్హత కలిగిన వారు 2026 అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఎక్సైజ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో కొత్త బార్‌లకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికంగా హైదరాబాద్‌లోనే.. ఎన్నంటే?
Telangana Bar Licenses
Balaraju Goud
|

Updated on: Sep 27, 2026 | 11:17 AM

Share

హైదరాబాద్: తెలంగాణలో బార్ లైసెన్స్‌ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 41 బార్ లైసెన్స్‌లను నోటిఫై చేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. జనాభా ఆధారంగా నిర్ణయించిన బేసిక్ ఎక్సైజ్ టాక్స్ స్లాబ్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు 2026 అక్టోబర్ 12 చివరి తేదీగా ప్రకటించారు.

హైదరాబాద్ పరిధిలో 14 బార్లు

గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పరిధిలోని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)లో అత్యధికంగా 14 బార్‌లను నోటిఫై చేశారు. ఈ ప్రాంతానికి BET స్లాబ్‌లను వర్తింపజేశారు. మొత్తం 41 బార్‌లలో అత్యధిక సంఖ్య హైదరాబాద్ కోర్ జనాభా ఆధారంగా స్లాబ్‌ రేటును రూ.44 లక్షలుగా నిర్ణయించారు. ఇతర ప్రాంతాల్లో రూ.30 లక్షలు, రూ.42 లక్షల స్లాబ్‌లను వర్తింపజేశారు. మొత్తం 41 బార్‌లలో అత్యధిక సంఖ్య హైదరాబాద్ Tకోర్‌ పరిధిలోనే ఉంది.

జిల్లాల వారీగా బార్‌ల వివరాలుః

హైదరాబాద్ – 14

అసిఫాబాద్ – 1

అలియాబాద్ – 1

ముదుచింతలపల్లి – 2

ఎల్లంపేట – 2

అశ్వారావుపేట – 1

కల్లూరు – 1

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ – 1

మక్తల్ – 1

దేవరకద్ర – 1

మద్దూర్ – 1

గడ్డపోతారం – 1

గుమ్మడిదల – 2

కోహిర్ – 1

బోధన్ – 1

బిచ్కుంద – 1

చేవెళ్ల – 1

మొయినాబాద్ – 2

కొడంగల్ – 1

పరిగి – 1

నర్సంపేట – 1

స్టేషన్ ఘన్‌పూర్ – 1

కేసముద్రం – 1

ములుగు – 1

మొత్తం: 41 బార్ లైసెన్స్‌లు

అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు

అర్హత కలిగిన దరఖాస్తుదారులు నిర్ణీత నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలి. లైసెన్స్‌కు సంబంధించిన అర్హతలు, షరతులు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలను తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్ tgbcl.telangana.gov.inలో పరిశీలించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?