Kinetic E-luna: ఈ-లూనా అదిరింది.. ఫస్ట్ రైడ్ గురించి రైడర్స్ చెప్పేది వింటే షాకవుతారు

భారతదేశంలో చాలా మంది తమ మొదటి సారి బండి నడిపింది లూనా అనే చెబుతున్నారు. 19వ దశకంలో లూనా స్కూటర్ అంటే ఓ బ్రాండ్. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో లూనా అంటే తెలియని వాళ్లు ఉండరు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా లూనా అప్‌గ్రేడ్ కాకపోవడంతో దాని మార్కెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే తాజాగా కైనిటిక్ కంపెనీ లూనాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లా లాంచ్ చేయడంతో ఈ స్కూటర్‌ను మళ్లీ ప్రజలను ఆకర్షిస్తుంది.

Kinetic E-luna: ఈ-లూనా అదిరింది.. ఫస్ట్ రైడ్ గురించి రైడర్స్ చెప్పేది వింటే షాకవుతారు
Kinetic E Luna
Follow us

|

Updated on: Jun 28, 2024 | 5:00 PM

భారతదేశంలో చాలా మంది తమ మొదటి సారి బండి నడిపింది లూనా అనే చెబుతున్నారు. 19వ దశకంలో లూనా స్కూటర్ అంటే ఓ బ్రాండ్. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో లూనా అంటే తెలియని వాళ్లు ఉండరు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా లూనా అప్‌గ్రేడ్ కాకపోవడంతో దాని మార్కెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే తాజాగా కైనిటిక్ కంపెనీ లూనాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లా లాంచ్ చేయడంతో ఈ స్కూటర్‌ను మళ్లీ ప్రజలను ఆకర్షిస్తుంది. అయితే ఈ నయా ఈవీ స్కూటర్‌ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పలువురు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ నేపత్యంలో లూనా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈ-లూనా ఈవీ స్కూటర్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఈ స్కూటర్ 96 కిలోల బరువు ఉండడంతో పాటు  డ్రమ్ బ్రేక్‌లతో రావడం సునాయస డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఈ స్కూటర్ 16 అంగుళాల స్పోక్డ్ వీల్స్‌పై నడుస్తుంది. 150 కిలోల లోడ్ బేరింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో రావడంతో ఎప్పటికప్పుడు బ్యాటరీ పనితీరును గమనించవచ్చని వివరిస్తున్నారు. ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, పార్సెల్‌లను తీసుకువెళ్లడానికి బ్యాగ్ హుక్, మరింత లగేజీ స్థలాన్ని జోడించడానికి రిమూవబుల్ డ్యూయల్ సీటును కలిగి ఉంది. ముఖ్యంగా సైడ్ స్టాండ్ ఇండికేటర్‌తో పాటు సేఫ్టీ లాక్ కూడా ఉంది. ఇది మార్కెట్‌లోని అనేక స్కూటర్‌ల మాదిరిగానే బ్రేక్‌ను లాక్ చేయడానికి అనుమతిస్తుంది.

ఈ-లూనా నాస్టాల్జియా కార్డ్‌ని బాగా ప్లే చేస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ సిల్హౌట్ పాత మోడళ్లను గుర్తుకు తెస్తుంది స్క్వేర్ హౌసింగ్‌లోని రౌండ్ హెడ్‌ల్యాంప్ ముఖ్యంగా రెట్రో లుక్‌తో ఆకర్షిస్తుంది. ఈ-లూనా 110 కిలోమీటర్ల క్లెయిమ్ చేసిన పరిధితో 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఎక్స్ 2 వేరియంట్ ఎక్స్1తో పోలిస్తే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అంటే 1.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌‌తో వచ్చే 1.2 కేడబ్ల్యూ మోటార్ ద్వారా నడిచే ఈ స్కూటర్ గరిష్ట వేగం 50 కిలోమీటర్లుగా పేర్కొంటున్నారు. అయితే ఈ-లూనా మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉన్నందున ప్రతి మోడ్‌లో గరిష్ట వేగం కొంత మొత్తానికి పరిమితం చేశారు. అందువల్ల గరిష్ట వేగం దాదాపు 35 కిలో మీటర్లకు పరిమితం చేశారు. మిగిలిన రెండు మోడ్‌లలో ఈ-లూనా క్లెయిమ్ 50 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ-లూనా రవాణాకు ప్రయోజనకరమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గాన్ని అందించడానికి ఉద్దేశించేలా ఉందని రైడర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధర విషయంలో ఈ-లూనా కాస్త ఎక్కువని, అంటే ఈ స్కూటర్ ధర రూ.74,990గా ఉంటే కొన్ని ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు కూడా ఇదే ధరలో మెరుగైన ఫీచర్లతో వస్తున్నాయని పేర్కొంటున్నారు. కేవలం రెట్రో లుక్‌తో బ్రాండ్‌పై నమ్మకంతో ఈ-లూనా సేల్స్ ఆధారపడి ఉంటాయని వివరిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..