AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan Tips: మీరు కూడా హోం లోన్ తీసుకున్నారా.. తీసుకుంటే పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి..

గృహాలను కొనుగోలు చేయడానికి, కట్టుకోవడానకి రుణం తీసుకుంటారు. ఇవి భారీ మొత్తంలో ఉంటాయి. కొన్ని సంవత్సరాలలో తిరిగి చెల్లిస్తుంటారు. హోం లోన్స్‌లో EMIలను చెల్లించడంలో డిఫాల్ట్ చేయకూడదు. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

Home Loan Tips: మీరు కూడా హోం లోన్ తీసుకున్నారా.. తీసుకుంటే పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి..
Home Loan
Sanjay Kasula
|

Updated on: Apr 26, 2023 | 9:17 PM

Share

గృహ రుణాలు తరచుగా ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఈ రుణాలు భారీ మొత్తంలో ఉంటాయి. రుణగ్రహీత వాయిదాలలో అంటే ఈఎంఐ క్రమంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చాలా సార్లు క్రమం తప్పకుండా చెల్లించినా.. కొన్ని అనుకోని పరిస్థితులు లేదా ఇతర ఆర్థిక సంక్షోభాల కారణంగా  ఈఎంఐలు చెల్లించక పోవచ్చు. కానీ మళ్లీ మళ్లీ ఈఎంఐ చెల్లించలేకపోవడం చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. హోమ్ లోన్ ఈఎంఐ డిఫాల్ట్ చేయడం వల్ల కలిగే చెడు పరిణామాలు ఎలా ఉంటాయి. అటువంటి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. భ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈఎంఐ డిఫాల్ట్ తరచుగా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌లో పడిపోవడానికి దారితీస్తుందుంది. ఒక వ్యక్తి హోమ్ లోన్ అర్హతలో క్రెడిట్ స్కోర్ ఒక ముఖ్యమైన అంశం కాబట్టి అటువంటి డిఫాల్ట్ మరొక గృహ రుణం లేదా మరేదైనా రుణాన్ని పొందడం చాలా కష్టతరం చేస్తుంది.

అసోసియేట్ దరఖాస్తుదారులపై ప్రభావం

అటువంటి లోన్ డిఫాల్ట్ ప్రభావం సాధారణంగా అసోసియేట్ దరఖాస్తుదారులపై కూడా ఉంటుంది. ఇది ప్రధాన దరఖాస్తుదారుకు మాత్రమే పరిమితం కాదు. ఈఎంఐ చెల్లింపులో డిఫాల్ట్ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది. ఇది దరఖాస్తుదారులకు ఉపాధి నుంచి అద్దె గృహాల వరకు ఇబ్బందులను సృష్టిస్తుంది.

లేట్ పేయిమెంట్ పెనాల్టీ

రుణం తీసుకునేటప్పుడు అతి తక్కువ వడ్డీ రేటుపై ప్రజలు శ్రద్ధ వహిస్తారు. అయితే ఇతర ఛార్జీలను పట్టించుకోరు. అటువంటి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి ఆలస్య చెల్లింపు పెనాల్టీ, అంటే సమయానికి ఈఎంఐని డిపాజిట్ చేయనందుకు జరిమానా. ఈ రుసుము బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి రుణం తీసుకునేటప్పుడు దీనిని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

టాప్-అప్, ఇతర రుణాలు

రుణగ్రహీత ఈఎంఐ చెల్లింపుల మంచి ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నట్లయితే, భవిష్యత్తులో టాప్-అప్ లోన్‌లు, వ్యక్తిగత రుణాలు, ఆకస్మిక రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, గృహ మెరుగుదలలు, విస్తరణ రుణాలు వంటి వివిధ రుణ ఎంపికలను ఎంచుకోవచ్చు. అదే సమయంలో, డిఫాల్ట్‌గా ఒక్క ఈఎంఐని కూడా పూరిస్తే ఈ ఆఫర్‌లు మీ నుంచి తీసివేయబడతాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం