AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Safety: ఏటీఎంలో క్యాన్సల్ బటన్‌ను రెండుసార్లు నొక్కుతున్నారా?.. జరిగేది ఇదే..

ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే ముందు చాలామంది 'క్యాన్సిల్' బటన్‌ను రెండుసార్లు నొక్కుతుంటారు. ఇలా చేయడం వల్ల పిన్ సురక్షితంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఇది నిజమేనా? నిజానికి, దీని వెనుక ఉన్న అసలు వాస్తవం వేరే ఉంది. ఈ సాధారణ అలవాటు వల్ల మన పిన్ నెంబర్ సురక్షితంగా ఉంటుందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

ATM Safety: ఏటీఎంలో క్యాన్సల్ బటన్‌ను రెండుసార్లు నొక్కుతున్నారా?.. జరిగేది ఇదే..
Atm Cancel Button
Bhavani
|

Updated on: Sep 09, 2025 | 6:50 PM

Share

ఇటీవల దేశవ్యాప్తంగా డబ్బు మోసాలు పెరిగాయి. హ్యాకర్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో, ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునే ముందు కేన్సల్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే పిన్ సురక్షితంగా ఉంటుందని ఒక సమాచారం 2022, 2023 సంవత్సరాలలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలామంది ఈ సమాచారాన్ని నిజమని నమ్ముతున్నారు. ఈ విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వ నిజ నిర్ధారణ బృందం వివరణ

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ నిజ నిర్ధారణ బృందం ఒక వివరణ ఇచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అలాగే, బ్యాంకులు కూడా ఈ విధానాన్ని కస్టమర్లకు సూచించలేదు. కేన్సల్ బటన్‌ను నొక్కడం లావాదేవీని ఆపడానికి మాత్రమే. దానికి పిన్ భద్రతకు ఎటువంటి సంబంధం లేదని వివరించింది.

ఏటీఎంలో పిన్ ఎలా దొంగిలిస్తారు?

పిన్ నెంబర్లు దొంగిలించడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.

స్కిమ్మింగ్ డివైస్: స్కిమ్మింగ్ పరికరాలను ఉపయోగించి కార్డు వివరాలను కాపీ చేసి పిన్ దొంగిలించవచ్చు.

దాగి ఉన్న కెమెరా: కస్టమర్ పిన్ నెంబర్ కొట్టేటప్పుడు దాగి ఉన్న కెమెరాను ఉపయోగించి గమనించి, డబ్బును దొంగిలిస్తారు.

పక్కన ఉన్నవారు: మనం డబ్బు తీసుకునేటప్పుడు పక్కన ఉన్నవారు మన పిన్‌ను గమనించి దాని ద్వారా డబ్బు దొంగిలించే పద్ధతి.

అందుకే, కేన్సల్ బటన్‌ను రెండుసార్లు నొక్కడం వల్ల ఈ మోసాలకు ఎటువంటి సంబంధం లేదు.

ఏటీఎం కార్డును సురక్షితంగా ఉపయోగించే పద్ధతులు

పిన్ కొట్టేటప్పుడు మీ చేతిని మూసి అంకెలను టైప్ చేయాలి.

ఏటీఎంలో అనవసరమైన పరికరాలు ఉన్నాయేమో చూసుకోవాలి.

ఎస్ఎంఎస్ అలర్ట్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలి. లావాదేవీ వివరాలు వెంటనే తెలియాలి.

అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించాలి.

పిన్‌ను ఎవరితోనూ పంచుకోకూడదు.

ఏటీఎం పిన్‌ను మూడు నుండి ఆరు నెలలకు ఒకసారి మార్చాలి.

1234, పుట్టిన తేదీ వంటి సులభంగా కనిపెట్టే పిన్‌లను పెట్టడం మానుకోవాలి.

కార్డు పోయినా లేదా ఏటీఎంలో ఇరుక్కున్నా వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.