Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆధార్‌లో ఫోన్‌ నెంబర్‌ అప్‌డేట్‌ కావడం లేదా..? ఇలా చేసి చూడండి..

Aadhaar Update: సిమ్‌ కార్డు నుంచి క్రెడిట్‌ కార్డు వరకు, బైక్‌ లోన్‌ నుంచి ఇంటి లోన్‌ వరకు ఏ చిన్న పనిచేయాలన్నా ఇప్పుడు ఆధార్‌ కార్డ్ తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఆధార్‌ వినియోగం అందరికీ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ఆధార్‌...

Aadhaar Update: ఆధార్‌లో ఫోన్‌ నెంబర్‌ అప్‌డేట్‌ కావడం లేదా..? ఇలా చేసి చూడండి..
Adhaar Card Phopne Number
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 26, 2022 | 1:57 PM

Aadhaar Update: సిమ్‌ కార్డు నుంచి క్రెడిట్‌ కార్డు వరకు, బైక్‌ లోన్‌ నుంచి ఇంటి లోన్‌ వరకు ఏ చిన్న పనిచేయాలన్నా ఇప్పుడు ఆధార్‌ కార్డ్ (Aadhaar Card) తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఆధార్‌ వినియోగం అందరికీ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ఆధార్‌ కార్డ్‌కు లింక్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌ (Aadhaar phone Link) కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆధార్‌తో లింక్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుండడంతో ఫోన్‌ నెంబర్‌ లింకేజ్‌ తప్పనిసరిగా మారింది. అయితే మీ కార్డుపై ఇప్పటికే ఉన్న ఫోన్‌ నెంబర్‌ను మార్చుకోవాలనుకుంటున్నారా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ పాటించడం ద్వారా ఈ పనిని సింపుల్‌గా చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఫోన్‌ నెంబర్‌ మార్చుకోవడానికి..

* ఇందుకోసం ముందుగా ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం మీరు మార్చాలనుకుంటున్న ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత బాక్సులో ఎంటర్‌ చేయడంతో పాటు, క్యాప్చ కోడ్‌ను కూడా టైప్‌ చేయాలి.

* తర్వాత ‘సెండ్‌ ఓటీపీ’ బటన్‌పై నొక్కితే.. మీ ఫోన్‌నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. సదరు ఓటీపీని ఎంటర్ చేసి ప్రొసీడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* ఆ తర్వాత ‘ఆన్‌లైన్‌ ఆధార్‌ సర్వీసెస్‌’లో మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘అప్‌డేటింగ్ ది మొబైల్‌ నెంబర్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకొని, సంబంధిత వివరాలను అందజేయాలి.

* అనంతరం మీరు మార్చాలనుకుంటున్న మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఓపెన్‌ అయిన కొత్త పేజీలో క్యాప్చ కోడ్‌ను కూడా ఎంటర్‌ చేస్తే.. మీ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫైచేసి ‘సేవ్‌ అండ్‌ ప్రొసీడ్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

* ఇక చివరిగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకొని మీకు సమీపంలో ఉన్న ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి రూ. 25 చెల్లించి, సంబంధిత డ్యాక్యుమెంట్లు సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది.

ఆఫ్‌లైన్‌లో మొబైల్‌ నెంబర్‌ మార్పు ఇలా..

ఆఫ్‌లైన్‌ విధానంలో ఫోన్‌ నెంబర్‌ మార్చుకోవాలనుకునే వారు మీకు దగ్గర్లోని ఆధార్‌ ఎన్రోల్‌ సెంటర్ వద్దకు వెళ్లాలి. అక్కడ సంబంధిత సంబంధిత ఫామ్‌లో మార్చాలనుకుంటున్న ఫోన్‌ నెంబర్‌ వివరాలతో పాటు, అవసరమైన డ్యాక్యుమెంట్లను సబ్‌మిట్ చేయాలి. బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ తర్వాత పేర్కొన్ని వ్యవధిలో మొబైల్‌ నెంబర్ మారుతుంది.

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడును ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌.. భారత్ దూరం

Russia Ukraine War: క్షణక్షణం.. భయం భయం.. బంకర్లలో బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు

ప్రాణం తీసిన అతివేగం.. గమ్యం చేరకుండానే మృత్యు ఒడికి.. అదే కారణమా