2000 Notes Exchange: రూ.2 వేల నోట్లు ఇంకా మీ దగ్గర ఉన్నాయా? అక్కడ ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు..!
భారతదేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకునేందుకు, అలాగే బ్లాక్ మనీను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ బాగానే అప్పటి వరకూ రూ.1000 నోటే భారతదేశంలో అతి పెద్ద డినామినేషన్‌గా ఉండేది. అనంతరం ఆ ప్లేస్‌లోకి రూ. రెండు వేల నోటు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోటు చలామణిని కూడా రద్దు చేసింది.
భారతదేశంలో నోట్ల రద్దు ఇబ్బంది ఎవరూ మర్చిపోరు. నవంబర్ 8, 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసింది. అనంతరం రూ.500, రూ.2 వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టింది. అప్పట్లో భారతదేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకునేందుకు, అలాగే బ్లాక్ మనీను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ బాగానే అప్పటి వరకూ రూ.1000 నోటే భారతదేశంలో అతి పెద్ద డినామినేషన్‌గా ఉండేది. అనంతరం ఆ ప్లేస్‌లోకి రూ. రెండు వేల నోటు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోటు చలామణిని కూడా రద్దు చేసింది. నోట్లు మార్చుకునేందుక సెప్టెంబర్ 30, 2023ను గడువుగా విధించింది. ఏ జాతీయ బ్యాంకులోనైనా ఈ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు ముగియడంతో అక్టోబర్ 7 వరకూ కూడా గడువు పెంచింది. అయితే గడువు ముగిసినా రూ. 2 వేల నోట్లు మార్చుకోని వారు ఇంకా ఉన్నారని ఆర్‌బీఐ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో రూ. 2 వేల నోట్ల మార్పిడికి మరో అవకాశం కల్పించింది. అయితే రెండు వేల మార్చుకోవడానికి ఇచ్చిన అవకాశం ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఆర్‌బీఐ కల్పించిన తాజా అవకాశం ఆర్‌బీఐ, ప్రభుత్వ నిబంధనల మేరకు ఉంటుంది. ప్రస్తుతం రూ. 2 వేల నోట్లను మార్చుకునే వారు కచ్చితంగా చెల్లుబాటయ్యే గుర్తింపు డాక్యుమెంట్ అందించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒకేసారి 10 నోట్లను మార్చుకునే వెసులబాటు ఉంటుంది. అయితే ఈ నోట్లను ఆర్‌బీఐ ఆఫీసుల వద్ద మాత్రమే మార్చుకోవాలి. ఒకవేళ ఆర్‌బీఐ ఆఫీసులను చేరుకోలేని పక్షంలో కచ్చితంగా ఆయా నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా ఆర్‌బీఐ కార్యాలయాలకు పంపి మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల ద్వారా ఈ నోట్లను మార్చుకోవచ్చు. బెంగుళూరు, చెన్నై, కోల్‌కత్తా, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ వంటి కార్యాలయాల్లో ఈ నోట్లను మార్పిడి చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి