Aadhaar: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అయ్యిందో తెలియదా.? ఇలా చెక్‌ చేసుకోండి.

ప్రస్తుతం గుర్తింపు కార్డుల్లో ఆధార్‌ తప్పనిసరిగా మారిపోయింది. ఏ చిన్న పని చేయాలన్నా ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సిమ్‌ కార్డ్‌ మొదలు, గుడిలో దర్శనం టికెట్‌ వరకు ఆధార్‌ కార్డు ఉడాల్సి ఉందే. ఇకా ఆధార్‌ కార్డును ఉపయోగించే క్రమంలో లింక్డ్‌ మొబైన్‌ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుందనే విషయం తెలిసిందే...

Aadhaar: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అయ్యిందో తెలియదా.? ఇలా చెక్‌ చేసుకోండి.
Aadhar Card
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2023 | 1:43 PM

ప్రస్తుతం గుర్తింపు కార్డుల్లో ఆధార్‌ తప్పనిసరిగా మారిపోయింది. ఏ చిన్న పని చేయాలన్నా ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సిమ్‌ కార్డ్‌ మొదలు, గుడిలో దర్శనం టికెట్‌ వరకు ఆధార్‌ కార్డు ఉడాల్సి ఉందే. ఇకా ఆధార్‌ కార్డును ఉపయోగించే క్రమంలో లింక్డ్‌ మొబైన్‌ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుందనే విషయం తెలిసిందే. అయితే కొందరు ఆధార్‌ కార్డుకు ఏ మొబైల్‌ నెంబర్‌ ఇచ్చారో తెలియక కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్‌ కార్డులు ఉపయోగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కన్ఫ్యూజన్‌ మరీ ఎక్కువవుతోంది.

ఈ నేపథ్యంలోనే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ చెక్ చేసుకునేందుకు ఓ విధానం అందుబాటులో ఉంది. ఇందులో భాంగానే యూఐడీఏఐ ఓ సదుపాయాన్ని అందించింది. యూఐడీఏఐ తీసుకొచ్చిన ఈ ఆప్షన్ ద్వారా ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్​ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఇందుకోసం ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. లేదా ఎం-ఆధార్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నా సరిపోతుంది. అనంతరం వెరిఫై ఈమెయిల్/మొబైల్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసకుఓవాలి. తర్వాత ఆధార్, మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీతో పాటు క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఇప్పటికే ధ్రువీకరించి ఉన్నట్లయితే.. ‘మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్ ఇప్పటికే మా రికార్డులతో ధ్రువీకరించబడింది’ అని చూపిస్తుంది. ఇలా మీ ఆధార్‌ కార్డుతో ఏ నెంబర్ లింక్‌ అయ్యిందో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..