Gold Prices: వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
గత వారం రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.3 వేలకుపైగా పెరిగింది. దీంతో రోజురోజుకి పెరుగుతున్న రేట్లతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. బంగారం ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ వారంలో ఏయే ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు ఎలా పెరిగాయో చూద్దాం.

బంగారం ధర గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఎంత ధర ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో గోల్డ్ ధరలు ఎంత పెరుగుతున్నాయి.. ఎంత తగ్గుతున్నాయి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంటుంది. బంగారం ధరల్లో ఎప్పుడు హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఒక రోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ల అంచనాలకు అనుగుణంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. గత వారం రోజుల్లో కూడా గోల్డ్ రేట్లలో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈ వారంలో బంగారం ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
జనవరి 11న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,40,460గా ఉండగా.. ఇప్పుడు రూ.1,43,780కి చేరుకున్నాయి. దీంతో వారం రోజుల్లో రూ.3320 మేర పెరిగినట్లయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే.. జనవరి 11న రూ.1,28,750గా ఉండగా.. జనవరి 17కు రూ.1,31,800కి చేరుకుంది. ఇక చెన్నైలో జనవరి 11న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650 వద్ద ఉండగా.. 17 నాటికి రూ.1,44,870కి చేరుకుంది. అంటే ఏకంగా రూ.5,220కి పెరిగింది.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో జనవరి 11వ తేదీన రూ.1,29,000గా ఉండగా.. జనవరి 17 నాటికి రూ.1,32,800 వద్ద స్థిరపడింది. అంటే ఈ వారంలో రూ.3800 పెరిగినట్లయింది. ఇక ఢిల్లీలో జనవరి 11వ తేదీన 24 క్యారెట్ల ప్యూర్ బంగారం రేటు రూ.1,40,610గా ఉండగా.. శనివారం నాటికి రూ.1,43,930 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వారం రోజుల్లో రూ.3320 పెరిగినట్లయింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ఢిల్లీ రూ.3050 ఈ వారంలో పెరిగింది.
