25 ఏళ్ల పాటు కట్టాల్సిన హోమ్ లోన్.. 20 ఏళ్లకే తీర్చాలా? జస్ట్ ఇలా చేస్తే చాలు.. రూ.18 లక్షలు మిగులుతాయి!
దీర్ఘకాలిక హోమ్ లోన్‌లపై వడ్డీ భారం తగ్గించుకోవాలంటే ముందస్తు చెల్లింపు ఉత్తమ మార్గం. ప్రతి సంవత్సరం ఒక అదనపు EMI చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల లోన్‌పై దాదాపు రూ. 18.31 లక్షల వడ్డీని ఆదా చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

మీరు 20, 25, లేదా 30 సంవత్సరాల దీర్ఘకాలిక హోమ్ లోన్ తీసుకున్నప్పుడు, అసలు కంటే వడ్డీకే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాల్లో మీ EMIలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. అసలులో చాలా తక్కువ మిగిలి ఉంటుంది. కానీ ఒక సాధారణ ముందస్తు చెల్లింపు ఉపాయంతో 8.5 శాతం వడ్డీ రేటుతో 25 సంవత్సరాల పాటు తీసుకున్న రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 20 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో తిరిగి చెల్లించవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు దాదాపు రూ.18.31 లక్షల వడ్డీని కూడా ఆదా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
- లోన్ మొత్తం: రూ. 50 లక్షలు
- ట్యూనర్ : 25 ఏళ్లు
- వడ్డీ రేటు: 8.5 శాతం
- EMI: రూ.40,261
- మొత్తం వడ్డీ: రూ.70.78 లక్షలు
- మొత్తం చెల్లింపు: దాదాపు రూ.1.21 కోట్లు
- అంటే వడ్డీ మొత్తం అసలు మొత్తం కంటే దాదాపు రూ.21 లక్షలు ఎక్కువగా ఉంటుందని మీరు చూడవచ్చు.
మీరు మీ హోమ్ లోన్ రెండవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఒక అదనపు EMI (అంటే రూ.40,261 అదనంగా) చెల్లించడం ప్రారంభిస్తే ఏమ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దాదాపు రూ.18.31 లక్షల వడ్డీ ఆదా అవుతుంది.
లోన్ కాలపరిమితిని దాదాపు 5 సంవత్సరాల 5 నెలలకు (65 నెలలు) తగ్గించవచ్చు. ముందస్తు చెల్లింపు అన్ని రకాల రుణాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అసలు మొత్తాన్ని తగ్గిస్తుంది. ఫ్లోటింగ్ రేటు రుణాలు సాధారణంగా జరిమానా లేని ముందస్తు చెల్లింపును అందిస్తాయి, అయితే స్థిర రేటు రుణాలకు కొన్ని ఛార్జీలు విధించవచ్చు, కాబట్టి ముందుగా నిబంధనలను తనిఖీ చేయండి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా, బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా లేదా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా ముందస్తు చెల్లింపు చేయవచ్చు. ఈ డబ్బును EMI తగ్గించడానికి కాదు, అసలు మొత్తాన్ని తగ్గించడానికి ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
