భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడ్డట్లే! ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

Gold Jewelry Storage at Home: రూ. 2000నోట్లను ఉపసంహరించకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో బంగారు ఆభరణాల కొలుగోళ్లు విపరీతంగా పెరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. మీరు కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసినా.. చేసే ఆలోచనలో ఉన్నా మీరు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోతారు.

భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడ్డట్లే! ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
Gold Jewellery
Follow us

|

Updated on: May 25, 2023 | 4:00 PM

రూ. 2000నోట్లను ఉపసంహరించకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో బంగారు ఆభరణాల కొలుగోళ్లు విపరీతంగా పెరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. అంటే చాలా మంది ఇంట్లో నిల్వ ఉన్న నగదుతో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారన్న మాట! మీరు కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసినా.. చేసే ఆలోచనలో ఉన్నా మీరు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటంటే మీరు ఇంట్లో ఉంచుకొనే బంగారానికి కూడా ఓ పరిమితి ఉంది. అలాగే బంగారంపై కూడా పన్ను విధిస్తారు. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు? బంగారంపై వచ్చే ఆదాయానికి ఎలా పన్ను విధించబడుతుందో తెలుసుకోవడం మంచిది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

బంగారం నిల్వ పరిమితి..

మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతించిన ఆదాయ మూలాన్ని వివరించగలిగితే, మీరు ఇంట్లో ఎంత మొత్తంలో అయినా బంగారు ఆభరణాలను ఉంచుకోవచ్చు. దీనిపై ఎటువంటి పరిమితి లేదు. అయితే, ఎలాంటి పన్ను ఇబ్బందులు లేకుండా ఇంట్లో ఉంచుకునే ఖాతాలో లేని బంగారు ఆభరణాల మొత్తానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం వివాహిత మహిళ అయితే 500 గ్రాముల వరకు, అవివాహిత అయితే 250 గ్రాముల వరకూ, పురుషులు అయితే కేవలం 100 గ్రాముల వరకూ మాత్రమే ఎటువంటి ప్రూఫ్ లు లేకుండా బంగారాన్ని కలిగి ఉండొచ్చు. అంతకు మించి ఉన్న బంగారానికి తప్పనిసరిగా లెక్కలు చూపాల్సిందే.

బంగారంపై పన్ను ఎలా విధిస్తారంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారు ఆభరణాలపై పరోక్ష పన్ను విధిస్తారు. ఉదాహరణకు, బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాల కొనుగోలుపై 3% జీఎస్టీ చెల్లించాలి. ఆభరణాలు, స్వర్ణకార సేవలకు సంబంధించిన ఛార్జీల విషయానికి వస్తే, జీఎస్టీ రేటు 5% గా ఉంటుంది. ఒకవేళ వ్యక్తులు బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనుకునే సందర్భాల్లో, వారు కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్, జీఎస్టీ నోటిఫైడ్ రేట్ల వద్ద చెల్లించవలసి ఉంటుంది. అయితే బంగారం కొనుగోలుపై ప్రత్యక్ష పన్ను ఉండదు. కొనుగోలు సమయంలో అందించిన పాన్ వివరాల ద్వారా బంగారం కొనుగోలు వివరాలను అధికారులు సంగ్రహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఐటీఆర్‌లో బంగారం నిల్వ చూపించాలా?

పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 50 లక్షలకు మించి ఉన్నట్లయితే, ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఉన్న దేశీయ ఆస్తులలో భాగంగా బంగారాన్ని బహిర్గతం చేయడం ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..