AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railways: డీజిల్‌ రైలు లీటర్‌కి ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు మీకోసం..

ఇండియన్‌ రైల్వేస్‌ చరిత్ర, ప్రాముఖ్యత ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైల్వే గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా మళ్లీ ఏదో ఒక కొత్త విషయం ఉండే ఉంటుంది. ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద రైల్‌ నెట్‌వర్క్‌ అయిన ఇండియన్‌ రైల్వేస్‌ ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. అందుకే ఈ సంస్థకు సంబంధించిన వివరాలు..

Railways: డీజిల్‌ రైలు లీటర్‌కి ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు మీకోసం..
Trains
Narender Vaitla
|

Updated on: May 25, 2023 | 3:40 PM

Share

ఇండియన్‌ రైల్వేస్‌ చరిత్ర, ప్రాముఖ్యత ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైల్వే గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా మళ్లీ ఏదో ఒక కొత్త విషయం ఉండే ఉంటుంది. ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద రైల్‌ నెట్‌వర్క్‌ అయిన ఇండియన్‌ రైల్వేస్‌ ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. అందుకే ఈ సంస్థకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఇక ఇండియన్‌ రైల్వేలో డీజీల్‌తో నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. మొదట్లో ఆవిరితో నడిచే రైల్లు ఆ తర్వాత డీజీల్‌తో నడిచే రైళ్లు ప్రస్తుతం విద్యుత్‌తో నడిచే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పటికీ చాలా వరకు డీజీల్‌తో నడిచే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సహజంగా వాహనాలకు సంబంధించి ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఉండేది ఎంత మైలేజ్‌ ఇస్తుందని. మరి రైల్లు ఎంత మైలేజ్‌ ఇస్తాయనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.?

సాధారణంగా ఇంజన్‌ సామార్థ్యం ప్రకారం రైలు ఇంధన కెపాసిటీని మూడు రకాలు విభజించారు. వీటిలో 5000 లీటర్లు, 5500 లీటర్లు, 6000 లీటర్లు ప్రధానమైనవి. ఇక మైలేజ్‌ విషయానికొస్తే.. డీజిల్ ఇంజిన్ మైలేజ్ అనేక అంశాలపై ముడిపడి ఉంటుంది. డీజీల్‌తో నడిచే 12 కోచ్‌ల ప్యాసింజర్‌ రైలు 6 లీటర్లకు ఒక కిలోమీటర్‌ మైలేజ్‌ ఇస్తుంది. అలాగే 24 కోచ్‌లతో నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా సేమ్‌ మైలేజ్‌ ఇస్తుంది. అయితే 12 కోచ్‌లతో నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్క కిలోమీటర్‌ ప్రయాణించడానికి 4.50 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది.

ప్యాసింర్‌తో పోల్చితే ఎక్స్‌ప్రెస్‌ ఎక్కువ మైలేజ్‌ ఇవ్వడానికి కారణం.. ప్యాసింజర్ రైలు అన్ని స్టేషన్‌లలో ఆగుతూ నడుస్తుంది. దీనివల్ల రైలులోని బ్రేకులు, యాక్సిలరేటర్లను ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే తక్కువ మైలేజ్‌ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..