AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. ఇంట్లో కూర్చుని దీపావళికి లక్షల డబ్బు సంపాదించే 7 సూపర్ ఐడియాస్ ఇవే..

తక్కువ పెట్టుబడితో.. మంచి లాభాలు సంపాదించాలని చూస్తున్నారా..? పండుగ సీజన్‌ను సొమ్ము చేసుకోవడానికి బెస్ట్ టైమ్ ఇదే.. స్పెషల్ గిఫ్ట్ ప్యాక్‌లు, ఇంట్లో చేసిన స్వీట్స్ డెలివరీ, ఎకో-ఫ్రెండ్లీ డెకరేషన్స్, హ్యాండ్‌మేడ్ నగలు వంటి 7 అద్భుతమైన బిజినెస్ ఐడియాలు మీకోసం.. అవి ఎలా మొదలుపెట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వారెవ్వా.. ఇంట్లో కూర్చుని దీపావళికి లక్షల డబ్బు సంపాదించే 7 సూపర్ ఐడియాస్ ఇవే..
Diwali Business Ideas
Krishna S
|

Updated on: Oct 08, 2025 | 2:33 PM

Share

పండుగ సీజన్.. ముఖ్యంగా దీపావళి వ్యాపారాలకు అత్యంత కీలక సమయం. మార్కెట్‌లో అన్నింటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు గిఫ్టులు, డెకరేషన్స్ కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు. మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా, మంచి లాభం వచ్చే వ్యాపారం చేయాలనుకుంటే ఈ 7 ఐడియాలు మీ కోసమే..

స్పెషల్ దీపావళి గిఫ్ట్ ప్యాక్‌లు

ఈ రోజుల్లో అందరూ స్పెషల్ గిఫ్టులు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు స్వీట్లు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ లేదా దీపాలు వంటివి కలిపి అందమైన ప్యాక్‌లు తయారు చేయవచ్చు. ప్యాకింగ్‌పై పేరు రాయడం లేదా ఒక చిన్న నోట్ పెట్టడం వంటి ‘స్పెషల్ టచ్’ ఇస్తే మీ గిఫ్టులు త్వరగా అమ్ముడవుతాయి.

ఎలా చేయాలి: హోల్‌సేల్ మార్కెట్‌లో వస్తువులు తక్కువ ధరకు కొని, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా అమ్మండి. పర్యావరణానికి హాని చేయని ప్యాకింగ్ వాడితే ఇంకా బెస్ట్.

దీపావళి డెకరేషన్స్ – లైట్లు

దీపావళి అంటేనే లైట్లు, రంగులు.. మీరు దియాలు, తోరణాలు, రంగోలిలు లేదా అలంకరణ వస్తువులను తయారు చేసి అమ్మవచ్చు. పాత డెకరేషన్స్ కాకుండా కొత్త ట్రెండింగ్ డిజైన్స్ అమ్మితే ఎక్కువ మంది కొంటారు.

ఎలా చేయాలి: మీరే సొంతంగా తయారు చేయండి లేదా తయారీదారుల నుండి తీసుకోండి. స్థానిక దుకాణాల్లో, ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేయండి.

ఇంట్లో చేసిన స్వీట్స్ డెలివరీ

స్వీట్స్, స్నాక్స్ లేకుండా దీపావళి లేదు. లడ్డూలు, బర్ఫీలు, చక్లీ లాంటివి ఇంట్లో శుభ్రంగా తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్మండి. ఆఫీసులు లేదా కంపెనీలకు బల్క్ ఆర్డర్లు తీసుకుంటే పెద్ద లాభం వస్తుంది.

ఎలా చేయాలి: చిన్న మొత్తంలో వంట చేసి టెస్ట్ చేయండి. ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా లేదా మీ సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేయండి. నాణ్యత ముఖ్యం.

పర్యావరణానికి హాని చేయని వస్తువులు

ప్రతి సంవత్సరం పర్యావరణం గురించి ఆలోచించేవారు పెరుగుతున్నారు. వారికి ఎకో-ఫ్రెండ్లీ క్రాకర్లు, రసాయనాలు లేని సహజ రంగోలి రంగులు లేదా పేపర్ దీపాలు అమ్మవచ్చు.

ఎలా చేయాలి: ఎకో-ఫ్రెండ్లీ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో వెతకండి. సోషల్ మీడియాలో ‘గ్రీన్ దీపావళి’ అని ప్రచారం చేయండి.

 ఆన్‌లైన్ ఈవెంట్లు – క్లాసులు

ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించే ఐడియా ఇది. దీపావళి సందర్భంగా ఆన్‌లైన్‌లో పార్టీలు, స్వీట్లు ఎలా తయారు చేయాలో క్లాసులు లేదా రంగోలి నేర్పే వర్క్‌షాప్‌లు నిర్వహించవచ్చు.

ఎలా చేయాలి: జూమ్ లేదా గూగుల్ మీట్ లాంటి యాప్‌లలో ఆన్‌లైన్ క్లాసులు పెట్టండి. ఆఫీస్ కంపెనీలకు వర్చువల్ ఈవెంట్ ప్యాకేజీలు అమ్మవచ్చు.

చేతితో చేసిన నగలు

దీపావళికి కొత్త డ్రెస్సులతో పాటు కొత్త నగలు కొనడం కామన్. మీకు నగలు తయారు చేసే టాలెంట్ ఉంటే ఫ్యాన్సీ చెవిపోగులు, నెక్లెస్‌లు తయారు చేసి అమ్మండి. మీ డిజైన్స్ యూనిక్‌గా ఉంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

ఎలా చేయాలి: పండుగకు తగ్గ కలెక్షన్స్ తయారు చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫోటోలు పెట్టి అమ్మండి.

గిఫ్ట్ ప్యాకింగ్ సర్వీస్

చాలా మందికి గిఫ్టులు చుట్టడానికి టైమ్ ఉండదు. మీరు అందంగా, కొత్త స్టైల్లో గిఫ్టులు చుట్టే సేవ అందించవచ్చు. ప్యాకింగ్ మీద ప్రత్యేక సందేశాలు రాయడం లాంటి కస్టమైజేషన్ ఇస్తే బాగా నడుస్తుంది.

ఎలా చేయాలి: ప్యాకింగ్ మెటీరియల్స్ ఎక్కువ మొత్తంలో కొనండి. మీ నమూనా ప్యాకింగ్‌ను సోషల్ మీడియాలో చూపించండి. ఎక్కువ గిఫ్టులు ఇచ్చే కంపెనీలతో మాట్లాడండి.

ఈ దీపావళిని మీ వ్యాపారానికి బెస్ట్ సీజన్‌గా మార్చుకోవాలంటే మీకు నచ్చిన ఐడియాను ఎంచుకుని, క్రియేటివ్ మార్కెటింగ్ చేయండి. త్వరగా మొదలుపెడితే, లాభాలు మీ సొంతం అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..