Tata Car Offers: టాటా కార్లపై బంపర్ ఆఫర్స్.. ఏకంగా రూ. 65,000 వరకూ తగ్గింపు.. త్వరపడండి..
కారు కొనేందుకు ఇదే మంచి సమయం. ఎందుకంటే సేఫ్టీకి పెట్టింది పేరైన టాటా మోటార్స్ తన ఉత్పత్తులపై అనేక ఆఫర్లు ప్రకటించింది. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడల్స్ పై ఈ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
కారు ఒకప్పుడు విలాసానికి పెట్టింది పేరుగా ఉండేది. అయితే కరోనా అనంతర పరిస్థితుల్లో కారు ఒక అవసరం అయిపోయింది. కుటుంబంలో నలుగురు కలిసి బయటకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఈ నేపథ్యంలో అందరూ కష్టమైనా, నష్టమైనా ఓ కారు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మీరు అలాంటి ఆలోచనలతోనే ఉంటే.. కారు కొనేందుకు ఇదే మంచి సమయం. ఎందుకంటే సేఫ్టీకి పెట్టింది పేరైన టాటా మోటార్స్ తన ఉత్పత్తులపై అనేక ఆఫర్లు ప్రకటించింది. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడల్స్ పై ఈ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఆయా మోడళ్లపై దాదాపు రూ. 65వేల వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఈ మార్చి నెలాఖరు వరకూ మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. పూర్తి వివరాలు చూద్దాం..
ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో..
కారు కొనుగోలు చేయాలనుకొనే వారికి ఇదే మంచి సమయం. ప్రస్తుతానికి కొత్త కారు బుకింగ్, డెలివరీలకు వెయింటింగ్ లిస్ట్ చేయాలే ఉంటుంది. పైగా 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుండటంతో కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టాటా మోటర్స్ ఆఫర్లు చూద్దాం..
టాటా టియాగో, టైగోర్..
2023లో తయారైన టియాగో, టైగోర్ కార్లపై రూ. 30,000 వరకూ ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై రూ. 15,000, సీఎన్జీ వేరియంట్లపై రూ. 20,000 వరకూ ఆఫర్లు ఉన్నాయి. అలాగే పాత కారు ఎక్స్ చేంజ్ పై రూ. 10,000 వరకూ ఆఫర్ ఉంది. అంతేకాక 2022 మోడల్ కార్లపై రూ. 40,000 వరకూ డిస్కౌంట్ అందిస్తోంది.
టాటా అల్ట్రోజ్, నెక్సాన్..
మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో టాటా నెక్సాన్ కూడా ఒకటి. ఈ కారుపై కూడా కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే అది కేవలం రూ.3000 మాత్రమే ఉంది. ఇతర క్యాష్ బ్యాక్, ఎక్స్ చేంజ్ ఆఫర్లు ఏమి లేవు. ఇక ఆల్ట్రోజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ పై రూ. 10,000 డిస్కౌంట్ వస్తోంది. అలాగే పెట్రోల్ డీసీఏ, డీజిల్ వేరియంట్లపై రూ. 15,000 వరకూ ఆఫర్ ఇస్తోంది. ఇంకా ఎక్స్ చేంజ్ పై రూ. 10,000 వరకూ ఆఫర్ ఉంది.
టాటా హారియర్, సఫారీ..
టాటా ఎస్యూవీ మోడళ్లైన హారియర్, సఫారీ కార్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. 2023 బీఎస్6 ఫేజ్1 కారుపై రూ.10,000 వరకూ డిస్కౌంట్ ఉంది. అలాగే పాత కారు కొనుగోలుపై రూ.25,000 వరకూ ఎక్స్ చేంజ్ అవకాశం ఇస్తున్నారు. అలాగే 2022 మోడళ్లపై దాదాపు రూ. 65,000 వరకూ డిస్కౌంట్లు అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..