Fixed Deposits: మరో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బంపర్ ఆఫర్.. వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి..
ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచింది.
ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్లపై 4 శాతం నుండి 6.25 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు 4.50 శాతం నుండి 6.75 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చు. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఇప్పుడు సాధారణ ప్రజలకు గరిష్టంగా 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. .
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FD రేట్లు:
– 7-14 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ పై, బ్యాంక్ 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 15 నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 4.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
– 46 నుండి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పై, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.50 శాతం వడ్డీ రేటును 91 -179 రోజుల వ్యవధిలో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.00 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
– 180 నుండి 364 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి ఇప్పుడు 6.75 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.
– 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు డిపాజిట్ పై, బ్యాంక్ 6.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.25 శాతం వడ్డీ రేటును వాగ్దానం చేస్తుంది.
-60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు చేసిన డిపాజిట్ కి ప్రతి సంవత్సరం 0.50 శాతం అదనపు వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. . సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా డిపాజిట్ స్కీమ్‌లతో పాటు ట్యాక్స్ సేవర్ డిపాజిటర్స్ స్కీమ్‌కి సాధారణ వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.
– సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద, సాధారణ ప్రజలకు 44 రోజుల డిపాజిట్ కాలవ్యవధిపై 7.35 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.
– 555 రోజుల డిపాజిట్ కాలవ్యవధిపై 7.00 శాతం 999 రోజుల డిపాజిట్ వ్యవధిపై 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం, 7.50 శాతం 7.00 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..