Fixed deposits: గుడ్ న్యూస్ చెప్పిన బ్యాంకులు.. భారీగా వడ్డీ రేటు పెంపు.. ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఉందో తెలుసుకోండి..
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేస్ పాయింట్లు పెంచింది. ఈ ప్రభావం ఫిక్స్ డ్ డిపాజిట్లపై పడింది. ఫలితంగా దేశంలోని అన్ని పెద్ద బ్యాంకులు తమ ఎఫ్ డీ లపై వడ్డీ రేట్లను పెంచాయి.
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో పెట్టుబడి పెట్టడం అనేది మీకు అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలలో ఒకటి. బ్యాంకులో అందుబాటులో ఉన్న అనేక రకాల పెట్టుబడి పథకాలలో, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) అత్యంత ప్రజాదరణ పొందినవి. అవి తక్కువ వ్యవధిలో గొప్ప లాభాలను అందించడమే కాకుండా, మీ డబ్బుకు పూర్తి భద్రత, భరోసాను ఇస్తాయి. అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ప్రభావం ఫిక్స్ డ్ డిపాజిట్లపై పడింది. ఫలితంగా దేశంలోని అన్ని పెద్ద బ్యాంకులు తమ ఎఫ్ డీ లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈనేపథ్యంలో ఏ బ్యాంకు ఎంత మేరకు పెంచాయో ఓ సారి చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 25 బేసిస్ పాయింట్లు పెంచింది. రూ. 2 కోట్ల వరకు ఉన్న ఎఫ్ డీలకు వర్తించే ఈ కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15, 2023 నుండి అమలులోకి వచ్చాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఎఫ్ డీ లపై వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్ డీలకు వర్తిస్తాయి.అంటే ఇప్పుడు తమ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. పై పెరిగిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 20, 2023 నుండి అమలులోకి వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్.. దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఎఫ్‌డీ వడ్డీ రేటును మార్చింది. కస్టమర్లు ఇప్పుడు 7.26 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్లు 8.01 శాతం వరకు ఉంటుంది.. ఈ రేట్లు ఫిబ్రవరి 11, 2023 నుండి అమలులో ఉన్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్.. ఈ బ్యాంక్ తన ఎఫ్‌డీ వడ్డీ రేట్లను కూడా పెంచింది. ఇది కస్టమర్లకు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. సాధారణ పౌరులకు 7.2 శాతం సీనియర్ సిటిజన్లకు 7.7 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.
ఫెడరల్ బ్యాంక్.. ఈ బ్యాంక్ ఇటీవలే రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. అత్యధిక వడ్డీ రేటు ఇప్పుడు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం. ఈ కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
డీసీబీ బ్యాంక్.. ఈ బ్యాంకు తన కస్టమర్లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 7.85 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు అదే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై గరిష్టంగా 8.10 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 16, 2023 నుంచి అమలు చేస్తున్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్.. ఈ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచింది. సాధారణ డిపాజిటర్లు ఇప్పుడు 7.5 శాతం వరకు వడ్డీని పొందవచ్చు, సీనియర్ సిటిజన్లు 8.25 శాతం వరకు పొందవచ్చు. ఈ అధిక రేట్లు ఫిబ్రవరి 16, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. ఇది ప్రస్తుతం తన కస్టమర్లకు రూ. 2 కోట్ల వరకు ఉన్న ఎఫ్‌డీ లపై 6.25 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. బ్యాంక్ 200-రోజుల ఎఫ్ డీలకు 7 శాతం, 400-రోజుల ఖతాలకు 6.75 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ కొత్త రేటు ఫిబ్రవరి 14, 2023 నుంచి అమలులోకి వచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..