Personal Finance: బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపడం ఎలా..? ఈ 4 మార్గాల గురించి మీకు తెలుసా..?
డబ్బులు పంపాలన్నా లేదా మీరు స్వీకరించాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాలా.. ? ప్రస్తుతం డిజిటల్ విప్లపం నడుస్తుండటంతో బ్యాంక్ అకౌంట్ ఉంటేనే సాధ్యమవుతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ బ్యాంక్ ఖాతా లేకపోయినా నగదు పంపించవచ్చు. ఇందుకు అనేక మార్గాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

డబ్బులు ఇతరులకు పంపాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ లేకపోయినా డబ్బులు ఇతరుల నుంచి పొందవచ్చు లేదా పంపించవచ్చు. ఇందుకోసం అనేక ఆప్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా లేదా ఇతరుల నుంచి మీరు పొందాలన్నా బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం లేదు. సులువుగా ట్రాన్సాక్షన్లు నిర్వహించుకునేందుకు డిజిటల్, మొబైల్ వాలెట్స్ లాంటివి అందుబాటులో వచ్చాయి. వీటి ద్వారా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇవే కాకుండా అనేక మార్గాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇందులో చూద్దాం.
డిజిటల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డులు
ప్రస్తుతం మార్కెట్లోకి ప్రీపెయిడ్ కార్డులు వచ్చేశాయి. కార్డులో డబ్బులను యాడ్ చేసి ఇతరులకు వీటి ద్వారా సులువుగా పంపించవచ్చు. అలాగే మొబైల్ వ్యాలెట్ల ద్వారా కూడా బ్యాంక్ ఖాతా అవసరం లేకుండా ఇతరులకు డబ్బులు పంపవచ్చు. ఇటీవల యూపీఐ యాప్స్‌లలో ఇలాంటి డిజిటల్ వ్యాలెట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంక్ అకౌంట్, యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా సులువుగా సెకన్లలోనే నగదు బదిలీ చేయవచ్చు. అయితే డిజిటల్ వ్యాలెట్లలోకి ముందుగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు యాడ్ చేయాలి. అనంతరం బ్యాంక్ అకౌంట్ లేకుండానే ట్రన్సాక్షన్లు చేసుకోవచ్చు.
క్యాష్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు
ఇక వెస్ట్రన్ యూనియన్ లాంటి చాలా థర్డ్ పార్టీ సంస్థలు చాలా ఉన్నాయి. ఇలాంటి క్యాష్ ట్రన్సాఫర్ ఏజెంట్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ అవసరం లేకుండా నగదు ట్రన్సాఫర్ చేయడం లేదా అందుకోవడం చేయవచ్చు. మీ సమీపంలోని ఏజెంట్ల వద్దకు వెళ్లి నగదు అందిస్తే వారు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ లేదా కోడ్ అందిస్తారు. ఈ కోడ్ సాయంతో అవతలి వ్యక్తి డబ్బు తీసుకోవచ్చు. అయితే ఏజెంట్లు కొంత మొత్తాన్ని మీ నుంచి రుసుంగా వసూలు చేస్తారు.
మనీ ఆర్డర్
ఇక పోస్టల్ శాఖ ద్వారా మనీ ఆర్డర్ చేయడం ద్వారా డబ్బులు పంపించవచ్చు. ప్రస్తుతం పోస్టల్ సేవలు వేగవంతం అయ్యాయి. 24 గంటల్లోనే మనీ ఆర్డర్లు రిసీవర్‌కు అందుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియ ద్వారా సురక్షితంగా డబ్బులు పంపించవచ్చు. గతంలో మనీ ఆర్డర్ల ద్వారా డబ్బులు పంపేవారు. కానీ ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగుపడటం, యూపీఐ లాంటి సెకన్లలోనే డబ్బులు పంపించే సాధనాలు అందుబాటులోకి రావడం మనీ ఆర్డర్లను ఉపయోగించేవారు తగ్గిపోయారు.
