Ombudsman: బ్యాంకు సేవల్లో లోపాలా? రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? ఫిర్యాదు చేయండిలా
రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం.. గత సంవత్సరం రెండు త్రైమాసికాల్లో అంటే ఏప్రిల్-జూన్ 2023, జూలై-సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో చాలా ఫిర్యాదులు వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. చాలా ఫిర్యాదులు రుణాలు , అడ్వాన్సులు, మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్‌లకు సంబంధించినవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ఫిర్యాదులలో వీటి వాటా 60 శాతం కంటే ఎక్కువ..
నమిత్ అనే వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు.సైబర్ నేరగాళ్లు అతని ఖాతా నుండి 50 వేల రూపాయలను దొంగిలించారు. నమిత్ సైబర్ సెల్‌కి వెళ్లాడు. బ్యాంకును కూడా సంప్రదించాడు. నమిత్ చాలా సార్లు బ్యాంకుకు దరఖాస్తు పెట్టాడు. కానీ బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీని తర్వాత నమిత్ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి బ్యాంక్‌పై ఫిర్యాదు చేశాడు. నమిత్ లాగానే, చాలా మంది కస్టమర్‌లు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌లో తమ బ్యాంకులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు. కొన్నిసార్లు ఫిర్యాదులు బ్యాంకు పేలవమైన సేవల గురించి.. కొన్నిసార్లు రుణాన్ని తిరిగి చెల్లించలేనందుకు రికవరీ ఏజెంట్ వేధింపుల గురించి ఉంటున్నాయి.
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌లో ఫిర్యాదులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌లో ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి? ఎలాంటి కంప్లయింట్స్ ఎక్కువగా వస్తున్నాయి? వాటన్నింటి గురించీ మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి ఎప్పుడు, ఎలా ఫిర్యాదు చేయవచ్చో కూడా తెలుసుకోండి.
మీరు బ్యాంకింగ్‌కు సంబంధించి ఏదైనా సమస్యను ఎదుర్కొంటే… ముందుగా మీరు బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేయండి. అక్కడ ఫిర్యాదు గురించి పట్టించుకోకపోయినా, మీకు న్యాయం జరగకపోయినా.. బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లండి.. అక్కడ మీరు ఫిర్యాదు చేయండి. కంప్లయింట్స్ ను పరిశీలించేందుకు ప్రతి బ్యాంకుకు నోడల్ అధికారి ఉంటారు. మీ ఫిర్యాదును బ్యాంకు ఒక నెలలోపు పరిష్కరించకపోతే మీకు బ్యాంక్ నుండి సంతృప్తికరమైన సమాధానం రాకుంటే.. మీరు రిజర్వ్ బ్యాంక్ కు సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ని సంప్రదించవచ్చు. మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి రెండు మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఒకటి ఆన్‌లైన్, మరొకటి ఆఫ్‌లైన్. వీటిలో ఆఫ్‌లైన్ అంటే మీరు వ్యక్తిగతంగా వెళ్లి సాదా కాగితంపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక ఆన్‌లైన్ ఫిర్యాదును బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పోర్టల్ అయిన cms.rbi.org.in లో ఫైల్ చేయవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం.. గత సంవత్సరం రెండు త్రైమాసికాల్లో అంటే ఏప్రిల్-జూన్ 2023, జూలై-సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో చాలా ఫిర్యాదులు వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. చాలా ఫిర్యాదులు రుణాలు , అడ్వాన్సులు, మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్‌లకు సంబంధించినవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ఫిర్యాదులలో వీటి వాటా 60 శాతం కంటే ఎక్కువ.
వీటిలో, రుణాలు , అడ్వాన్స్‌లు , మోసాలపై గరిష్ట సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయినప్పుడు రికవరీ ఏజెంట్ వేధింపులకు సంబంధించినవి. రికవరీ ఏజెంట్ల సేవలను తీసుకోవడానికి బ్యాంకులు సరైన విధానాన్ని అనుసరించాలి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం డిసైడ్ చేశారు. దీనివల్ల రికవరీ ఏజెంట్లు అలాంటివారిని వేధించలేరు. ఇటువంటి ఫిర్యాదుల వాటా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 24 శాతం (24.03%) కంటే ఎక్కువగా ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 23 శాతం (23.55%) కంటే ఎక్కువ.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 16 వేల (16,607) కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. అయితే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 17,732. ఈ కాలంలో మొబైల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కు సంబంధించిన ఫిర్యాదులు 18.23%. క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల వాటా వరుసగా 14.53 , 13.54 శాతంగా ఉంది. అదేవిధంగా, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల వాటా వరుసగా 9.62 నుంచి, 10.21 శాతంగా ఉంది. మొత్తం మీద రెండు త్రైమాసికాల్లో 1 లక్ష 44 వేల ఫిర్యాదులు అంబుడ్స్‌మన్‌కు అందినట్లు తెలుస్తోంది. దేశంలో బ్యాంకింగ్ సంస్కరణల నియమాలలో కఠినత్వం అవసరమని , బ్యాంకుల జవాబుదారీతనం స్థిరంగా ఉండాలని దీనివల్ల స్పష్టమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి