- Telugu News Photo Gallery Business photos Modi Government May Make A Big Announcement Before The Elections Regarding LPG Cylinder Subsidy
LPG Cylinder: ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ ధరలపై కీలక ప్రకటన చేయనుందా?
ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడవచ్చు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సిలిండర్ ధరను రూ. 500 హామీ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల హామీ ఇంతవరకు అమలు కాలేదు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్వరలో గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య ..
Updated on: Jan 19, 2024 | 3:56 PM

రానున్న రోజుల్లో పేద కుటుంబాలకు తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్లను అందించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. గత సంవత్సరం ఆగస్టు నెలలో కూడా మోడీ ప్రభుత్వం గృహాలలో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్‌ల ధరను 200 రూపాయలు తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు 400 రూపాయల సబ్సిడీని పొందడం ప్రారంభించారు.

నివేదికల ప్రకారం.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దేశంలో సగటు తలసరి వినియోగాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు రూ.300 సబ్సిడీ మొత్తాన్ని మరింత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులు ఢిల్లీలో రూ. 603కి 14.4 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ను పొందుతారు. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1200 పలుకుతుండడం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది.

సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్ లక్నోలో రూ.1140, ఢిల్లీలో రూ.1103, పాట్నాలో రూ.1201, జైపూర్‌లో రూ.1106, అహ్మదాబాద్‌లో రూ.1110, ముంబైలో రూ.1102లకు లభిస్తుంది. అయితే ఈ ధరలు భారతదేశం పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే చాలా తక్కువ.

ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడవచ్చు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సిలిండర్ ధరను రూ. 500 హామీ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల హామీ ఇంతవరకు అమలు కాలేదు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్వరలో గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య దాదాపు 33 కోట్లు. గతేడాది 2025-26 నాటికి మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.





























