AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Jeevan Dhara II Plan: ఎల్‌ఐసీ నుంచి మరో అద్భుతమైన పాలసీ.. పూర్తి వివరాలు

కరోనా తర్వాత హెల్‌ పాలసీలతో పాటు, వివిధ రకాల బీమా పాలసీలను ఎంచుకుంటున్నారు. ఇక జీవిత బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) కూడా వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులకు ఉపయోగకరమైన పాలసీలను ప్రవేశపెడుతోంది. ఇక ఎల్‌ఐసీ తాజాగా మరో పాలసీని తీసుకువచ్చింది. అదే 'జీవన్‌ ధార 2 ప్లాన్‌'..

LIC Jeevan Dhara II Plan: ఎల్‌ఐసీ నుంచి మరో అద్భుతమైన పాలసీ.. పూర్తి వివరాలు
Lic Jeevan Dhara Ii Plan
Subhash Goud
|

Updated on: Jan 20, 2024 | 9:53 AM

Share

ప్రస్తుతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఆరోగ్యంపై పెద్దగా పట్టించుకోని జనాలు.. కరోనా తర్వాత తమతమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. కరోనా తర్వాత హెల్‌ పాలసీలతో పాటు, వివిధ రకాల బీమా పాలసీలను ఎంచుకుంటున్నారు. ఇక జీవిత బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) కూడా వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులకు ఉపయోగకరమైన పాలసీలను ప్రవేశపెడుతోంది. ఇక ఎల్‌ఐసీ తాజాగా మరో పాలసీని తీసుకువచ్చింది. అదే ‘జీవన్‌ ధార 2 ప్లాన్‌’.

ఇది వ్యక్తిగత, సేవింగ్స్‌, డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస వయసు 20 ఏళ్లు. గరిష్ఠ వయసు 80, 70, 65 సంవత్సరాలు. ప్రారంభం నుంచి యాన్యుటీకి అనుమతిస్తారు. అయితే ఈ ప్లాన్‌ జనవరి 22వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌ కింద 11 యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఎల్‌ఐసీ చైర్మన్‌ సిద్ధార్థ మొహంతి దీన్ని ఆవిష్కరించారు. డిఫర్‌మెంట్‌ సమయంలో జీవిత బీమా కవరేజీ కూడా కల్పిస్తారు.

అధిక వయసుకి అధిక యాన్యుటీ రేట్లు వర్తించేలా ఈ పాలసీ ప్లాన్‌ను రూపొందించారు. రెగ్యులర్‌ ప్రీమియం, సింగిల్‌ ప్రీమియం అందుబాటులో ఉంటాయి. డిఫర్‌మెంట్‌ అంటే పాలసీదారుడు ఎంచుకున్న మేరకు భవిష్యత్తులో బీమా పాలసీ ప్రయోజనాలు అందుకునే విధంగా రూపొందించారు. కాలపరిమితి రెగ్యులర్‌ ప్రీమియంలో 5-15 సంవత్సరాలు. కాగా సింగిల్‌ ప్రీమియంలో 1-15 సంవత్సరాలు ఉంటుంది. డిఫర్‌మెంట్‌ సమయంలోను, ఆ తర్వాత కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని మొహంతి తెలిపారు.

ఇవి కూడా చదవండి

నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ డిఫర్‌మెంట్ పీరియడ్‌లో లైఫ్ కవరేజీని అందిస్తుంది. అధిక వయస్సులో ఎక్కువ యాన్యుటీ రేటును అందిస్తుంది. ఆ పాలసీ ప్లాన్‌లో లోన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి