Post office: ఇండియన్‌ పోస్ట్ పేరుతో ఏవైనా లింక్స్‌ వస్తున్నాయా.? ఓపెన్ చేశారో..

బ్లూడార్ట్‌ వంటి కొరియర్‌ సర్వీసులతో పేరుతో జరుగుతోన్న మోసాలకు సంబంధించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం పోస్టాఫీస్‌ పేరుతో కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్‌ నుంచి ఏదైనా మెసేజ్‌ వస్తే అందులో ఎంతోకొంత నిజం ఉందని ప్రజలు అనుకోవడం కామన్. దీనిని తమకు అనుగుణంగా మార్చుకున్న...

Post office: ఇండియన్‌ పోస్ట్ పేరుతో ఏవైనా లింక్స్‌ వస్తున్నాయా.? ఓపెన్ చేశారో..
Fact Check
Follow us

|

Updated on: Jul 01, 2024 | 3:32 PM

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు పెరిగిన టెక్నాలజీని తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. రకరకాల మోసాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సైబర్ మోసాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ మోసానికి సంబంధించి ప్రజలను అలర్ట్‌ చేశారు అధికారులు.

బ్లూడార్ట్‌ వంటి కొరియర్‌ సర్వీసులతో పేరుతో జరుగుతోన్న మోసాలకు సంబంధించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం పోస్టాఫీస్‌ పేరుతో కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్‌ నుంచి ఏదైనా మెసేజ్‌ వస్తే అందులో ఎంతోకొంత నిజం ఉందని ప్రజలు అనుకోవడం కామన్. దీనిని తమకు అనుగుణంగా మార్చుకున్న కొందరు కేటుగాళ్లు ప్రజల డబ్బును కాజేస్తున్నారు.

ఇండియా పోస్ట్‌ పేరుతో మొబైల్‌కు ఒక టెక్ట్స్‌ మెసేజ్‌ను పంపిస్తున్నారు. అందుకే మీకు ఒక పార్శిల్ వచ్చిందని, డెలివరీ కోసం అడ్రస్‌ నిర్దారణ చేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొంటున్నారు. 48 గంటల్లో ఈ మెసేజ్‌కు స్పందించాలని సదరు మెసేజ్‌లో పేర్కొన్నారు. మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి అడ్రస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని చెబుతున్నారు. పొరపాటు ఆ లింక్‌ను క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే. సదరు లింక్‌ను క్లిక్‌ చేయగానే ఫోన్‌లోకి ఆటోమెటిక్‌గా మాల్వేర్‌ చొచ్చుకుపోతుంది. ఇది ఫోన్‌లోని డేటాను మొత్తం అవతలి వ్యక్తికి అందిస్తుంది.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కాగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి వైరల్‌ అయ్యే సమాచారంలో ఉన్న నిజానిజాల గురించి తెలుసుకోవడానికి. కేంద్ర ప్రభుత్వం ఈ సేవను అందిస్తోంది. మీకు ఏదైనా మెసేజ్‌లు అనుమానస్పదంగా అనిపేస్తే వెంటనే సదరు స్క్రీన్‌ చాట్‌ను 918799711259 వాట్సాప్ నెంబర్‌కి లేదా, pibfactcheck@gmail.com మెయిల్‌కు పంపొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..