Crypto Currency: క్రిప్టోకరెన్సీ.. ఇప్పుడిదే ట్రెండింగ్ టాపిక్.. కంటికి కనిపించని ఈ కరెన్సీ ఏమిటో పూర్తిగా తెలుసుకోండి!

ఇప్పుడు ఎక్కడ విన్నా.. చూసినా.. క్రిప్టోకరెన్సీ గురించిన వార్తలే. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన దేశంలో ప్రభుత్వం ఈ క్రిప్టోకరెన్సీల పై నిషేధం తీసుకురావచ్చనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

Crypto Currency: క్రిప్టోకరెన్సీ.. ఇప్పుడిదే ట్రెండింగ్ టాపిక్.. కంటికి కనిపించని ఈ కరెన్సీ ఏమిటో పూర్తిగా తెలుసుకోండి!
Cryptocurrency

Crypto Currency: ఇప్పుడు ఎక్కడ విన్నా.. చూసినా.. క్రిప్టోకరెన్సీ గురించిన వార్తలే. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన దేశంలో ప్రభుత్వం ఈ క్రిప్టోకరెన్సీల పై నిషేధం తీసుకురావచ్చనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఈ కరెన్సీ వ్యాపారాన్ని నియంత్రించే ఆలోచన చేస్తోందనే విషయం సంచలనంగా మారింది. దీని కారణంగా క్రిప్టోకరెన్సీ రెట్లు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి? దీని వలన నష్టం ఏమిటి? దీనిని ప్రభుత్వం ఎందుకు నియంత్రించాలని అనుకుంటోంది? ఇటువంటి విషయాలు తెలుసుకుందాం.

క్రిప్టోకరెన్సీ అంటే ఇదీ..

ఇది మీ రూపాయి, డాలర్, యెన్ లేదా పౌండ్ల వంటి అదే కరెన్సీ. కానీ ఇది డిజిటల్ అంటే వర్చువల్. ఈ వర్చువల్ కరెన్సీ క్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌చైన్ టెక్నాలజీ నుండి తయారు చేసినది. అందుకే దీనిని క్రిప్టోకరెన్సీ అంటారు. ఇది భౌతికంగా కనిపించదు.
మీకు  రూపాయి, డాలర్, యెన్ లేదా పౌండ్ వంటి కరెన్సీలను దానిని జారీ చేసిన దేశంలోని సెంట్రల్ బ్యాంక్ నియంత్రిస్తుంది. ఈ కరెన్సీ ఎంత, ఎప్పుడు ముద్రిస్తారో వారు దేశ ఆర్థిక పరిస్థితిని చూసి నిర్ణయిస్తారు. కానీ క్రిప్టోకరెన్సీలపై ఎవరికీ నియంత్రణ ఉండదు. ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ. దీన్ని ఏ ప్రభుత్వం లేదా సంస్థ నియంత్రించలేవు. ఈ కారణంగా దానిలో అస్థిరత ఉంది. ఇది పంపిణీ వ్యవస్థపై పనిచేస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇది లేని వస్తువు మీద మనం రూపాయలు పెట్టుబడి పెట్టడం లాంటిది. అక్కడ మనం పెట్టిన రూపాయలే భౌతికం (ఇది కూడా వర్చువల్ గానే). కానీ, బిట్ కాయిన్ ముక్క కూడా చూద్దామన్నా మనకు కనిపించదు.

క్రిప్టోలో లోపాలు ఇవే..

1. పాస్ వర్డ్ 10 సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే ఇక పని చేయదు. అమెరికాకు చెందిన స్టీఫెన్ ధామస్ అనే వ్యక్తి తన పాస్ వర్డ్ మర్చిపోయాడు. ఇప్పటికే తనకు గుర్తున్న పాస్ వర్డ్ సార్లు కొట్టిన అతను ఇక ఆ పని చేయడం మానేశాడు. ఎందుకంటే ఇంకో రెండుసార్లు తప్పుడు పాస్ వర్డ్ కొడితే 1753 కోట్ల రూపాయలు పోయే అవకాశం ఉంది.
2. ర్యాంసన్ వైరస్ వచ్చి మన కంప్యూటర్ హ్యాక్ అయ్యే వీలుంది. అలా జరిగితే పాస్ వర్డ్ ఇతరులకు చేరే ప్రమాదం
3. ఒకప్పుడు స్విస్ బ్యాంక్ లో దాచే వాళ్లు. ఇప్పుడు క్రిప్టో వైపు మొగ్గు చూపుతున్నారు.
4. పోన్ పే, గుగుల్ పే, అమెజాన్, పేటీఎం వంటివి యూపీఐ అడ్రస్ ద్వారా జరుగుతున్నాయి. అదే అడ్రస్ ప్రభుత్వం చేతిలో ఉంటే సేఫ్. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతిల్లో అంత సేఫ్ కాదు.
5. క్రిప్టో ద్వారా మోసపోయినా, ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు.
6. హ్యాకర్లు బ్లాక్ చైన్ సైటులో లోపాలు కనిపెట్టారు. ఎథేర్ లాంటి కొన్ని వేల డిజిటల్ టోకెన్‌‌‌‌లు దొంగిలించారు. ఇలా దొంగిలించిన వాటి విలువ సుమారు 4,445 కోట్లు.ఫలితంగా క్రిప్టో కాయిన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా..

  • ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న క్రిప్టోకరెన్సీలు 14,755.
  • ఇవి 154 దేశాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి.
  • క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు 30 కోట్లు
  • దీని మార్కెట్‌ క్యాప్‌ 2.59 ట్రిలియన్‌ డాలర్లు
  • వీటిలో బిట్‌కాయిన్‌ స్టేక్‌ 41.4 %
  • ఎథేరియం 19.7 %
  • ఎక్చేంజీలు 431
  • వీటిని అనుమతిస్తున్న సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 18వేలు ఉన్నాయి. ( సోర్స్‌ coinmarketcap.com)

ఇప్పటివరకూ క్రిప్టోకరెన్సీ అనుమతించిన దేశాలు

ఎల్‌ సాల్విడార్‌

బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తింపు

అమెరికా

లావాదేవీలకు అనుమతిస్తున్న టెస్లా, మోర్గాన్‌ స్టాన్లీ వంటి కొన్ని కంపెనీలు
US డెరివేటీవ్‌ మార్కెట్లో ఎంట్రీ

కెనడా

లావాదేవీలను అనుమతి
లాభదాయక వ్యాపారంగా గుర్తింపు

ఆస్ట్రేలియా

కేపిటల్‌ గెయిన్‌ అసెట్‌గా గుర్తింపు
ట్యాక్స్‌ ద్వారా ఆదాయం

భారత్లో  క్రిప్టో డేటా ఇదీ..

దేశంలో ఇన్వెస్టర్లు 10.07 కోట్లు
క్రిప్టో ఉన్న పాపులేషన్‌ 7.9 %
ప్రపంచంలో హయ్యస్ట్‌ యూజర్స్‌
ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.80వేల కోట్లు
డెయిలీ ట్రేడింగ్‌ వాల్యూ రూ.7500 కోట్లు
ఏడాదిలో ట్రేడింగ్‌ గ్రోత్‌ 600 %
అసెట్‌ వాల్యూ గ్రోత్‌ రేట్‌ 1000 %
(సోర్స్‌ Crypto research సంస్థ CREBACO)

క్రిప్టో కరెన్సీ పై మన దేశంలోని ప్రముఖులలో వివిధ రకాల అభిప్రాయాలున్నాయి. కొందరు ప్రముఖులు ఏమంటున్నారంటే..

1. నరేంద్రమోడీ, ప్రధానమంత్రి

సంఘ విద్రోహశక్తుల చేతికి పోయే ప్రమాదం. యువశక్తి నిర్వీర్యం అయ్యే అవకాశం.

2. శక్తికాంత దాస్‌, RBI గవర్నర్‌

క్రిప్టో కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ప్రమాదం, నిషేధించాలి.

3. రాకేష్‌ ఝన్‌ఝన్‌వాలా, స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌

భౌతికరూపం లేని కరెన్సీలు. బిట్‌ కాయిన్‌ 50రూపాయిలకు ఇచ్చినా తీసుకోను.

4. నందన్‌ నీలేకని, ఆధార్‌ రూపకర్త

క్రిప్టోను కూడా అసెట్‌ క్లాస్‌గా గుర్తించాలి. టెక్నాలజీలో వస్తున్న మార్పు ఇది.

5. జయంత్‌ సిన్హా , పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ

క్రిప్టోను బ్యాన్‌ చేయడం కష్టం. దీనిని రెగ్యులేట్‌ చేయాల్సి రావొచ్చు.

6. రఘురామ్‌ రాజన్‌, RBI మాజీ గవర్నర్‌

క్రిప్టో కరెన్సీలకు విలువ లేదనలేం. నియంత్రణ అవసరం.

ఇవి కూడా చదవండి: Weight Loss: బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రయోజనం లేదు.. ఆహారాన్ని ఇలా తీసుకోవడం ద్వారా కూడా సన్నపడవచ్చు..

Air Purifiers for home: ఇంటిలో గాలిని స్వచ్చంగా మార్చే ప్యూరిఫైయర్స్.. పనితీరులో అత్యధిక రేటింగ్ ఉన్నవి ఏమిటో తెలుసుకోండి!

Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!

Click on your DTH Provider to Add TV9 Telugu