AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF accounts: పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న కోట్ల కొద్దీ డబ్బు.. ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడి

వివిధ కంపెనీలు, ప్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి నెలా వారికి వచ్చే జీతం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇలా పోగయిన డబ్బును ఆ ఉద్యోగి విరమణ చేసిన తర్వాత అందజేస్తారు. అతడి భవిష్యత్తు అవసరాలకు, వయసు పైబడిన తర్వాత బతకడానికి ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది.

EPF accounts: పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న కోట్ల కొద్దీ డబ్బు.. ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడి
Epfo
Nikhil
|

Updated on: Aug 10, 2024 | 6:36 PM

Share

వివిధ కంపెనీలు, ప్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి నెలా వారికి వచ్చే జీతం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇలా పోగయిన డబ్బును ఆ ఉద్యోగి విరమణ చేసిన తర్వాత అందజేస్తారు. అతడి భవిష్యత్తు అవసరాలకు, వయసు పైబడిన తర్వాత బతకడానికి ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేస్తుండగా అత్యవసరమైతే ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే వీలు కూడా ఉంది. కొందరు ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాను వదిలేస్తున్నారు. కొత్త కంపెనీలో కొత్తగా ఖాతా ప్రారంభిస్తున్నారు. పాత ఖాతాను కొత్త కంపెనీకి మార్చుకునేందుకు ఉన్నఅవకాశంపై వారికి అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అప్పటి వరకూ పాత ఖాతాలో డబ్బులను అలాగే వదిలేస్తున్నారు. వాటిని విత్ డ్రా చేయకుండా ఉండడంతో అలాంటి ఖాతాలో కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. ఆర్టీఐ ద్వారా వెల్లడైన లెక్కల ప్రకారం పీఎఫ్ ఖాతాలలో క్లెయిమ్ చేయకుండా వదిలేసిన సొమ్ము రూ.54,657.87 కోట్లకు చేరుకుంది.

ఆర్టీఐ ద్వారా వెల్లడి

ఆకాష్ గోయెల్ అనే ఇంజినీర్ సమాచారహక్కు చట్టం ద్వారా ఈపీఎఫ్ ఖాతాలలో క్లెయిమ్ చేయని సొమ్ము ఎంత ఉందని అర్జీ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి సొమ్ము రూ.54,657.87 కోట్లు ఉన్నట్టు సంబంధించి అధికారులు వెల్లడించారు. 2015 నుంచి 2018 సంవత్సరాలలో లెక్కలను చూసి ఈ వివరాలు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరాంతానికి రూ.40,865.14 కోట్లు ఉన్న ఈ మొత్తం 2016-17 నాటికి రూ.45,093.41 కోట్లు, అలాగే 2017-18 చివరకు రూ.54,657.87 కోట్లకు చేరింది. కానీ 2018-19లో రూ.1,638.37 కోట్లు, 2019-20 చివరి నాటికి Rs2,827.29 కోట్లకు సేకరించారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాలలో మినహా మిగిలిన అన్ని సంవత్సరాలలో భారీగా డబ్బులు పోగయ్యాయి.

గణనీయంగా పెరుగుదల

2015-15 ఆర్థిక సంవత్సరంలో పనిచేయని ఖాతాల నుంచి రూ.రూ.5,826.89 కోట్లను క్లెయిమ్‌దారులకు చెల్లించించారు. అలాగే 2016-17లో రూ.5,246.91 కోట్లు, 2017-18లో రూ.3,618.56 కోట్లు, 2019-20లో రూ.2,881.53 కోట్లు చెల్లింపులు జరిపారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం క్లెయిమ్ చేయకుండా అలాగే ఖాతాలలో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్) కింద ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈపీఎఫ్ ఖాతాల నుంచి క్లెయిమ్ చేయని డబ్బును ఏడు సంవత్సరాల తర్వాత సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్సీడబ్బ్యూఎఫ్)కు బదిలీ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..