Credit Score: క్రెడిట్‌ కార్డుల వల్ల క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుందా..? ఈ విధంగా పెంచుకోండి..!

Credit Score: దేశంలో నాలుగు సంస్థలు క్రెడిట్‌ స్కోర్‌ను అందిస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, క్రిఫ్‌ హై మార్క్‌ సంస్థలు రుణగ్రహీతలు..

Credit Score: క్రెడిట్‌ కార్డుల వల్ల క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుందా..? ఈ విధంగా పెంచుకోండి..!
Follow us

|

Updated on: Sep 20, 2021 | 3:33 PM

Credit Score: దేశంలో నాలుగు సంస్థలు క్రెడిట్‌ స్కోర్‌ను అందిస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, క్రిఫ్‌ హై మార్క్‌ సంస్థలు రుణగ్రహీతలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపుల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ స్కోర్‌ను అందిస్తుంటాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కువగా సిబిల్‌ స్కోరు ఆధారంగానే రుణాలను ఇస్తుంటాయి. ఇక క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్న సందర్భాల్లో బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు తిరస్కరిస్తుంటాయి. క్రెడిట్‌ కార్డు వాడే విధానం తెలిసి ఉండాలి. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా.. అని ఇష్టమొచ్చినట్లు వాడుతుంటే చెల్లించే ముందు ఇబ్బందులు తలెత్తి క్రెడిట్‌ స్కోర్‌ పడిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు భవిష్యత్తులో ఏ బ్యాంకు నుంచి కూడా రుణం పొందలేని పరిస్థితి వస్తుంది.

వ్యవధిలోపే చెల్లించండి..

క్రెడిట్‌ బ్యూరోలు ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపుల తీరును పరిశీలిస్తూ ఉంటాయి. కార్డుపై తీసుకున్న అమోంట్‌ను కాల వ్యవధిలోనే చెల్లించాలి. అప్పుడు మీ క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటుంది. తరచూ ఆలస్యం జరుగుతుంటే.. స్కోరు దెబ్బతింటుంది. వీలైనంత వరకూ బిల్లులను సకాలంలో చెల్లించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే క్రెడిట్‌ స్కోరులో విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్తగా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు కనీసం రెండు మూడేళ్ల నుంచి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

స్కోర్‌ను పరిశీలిస్తుండాలి..

రుణాల చెల్లింపుల విషయంలో మన క్రమశిక్షణ ఎలా ఉందన్నది తెలుసుకోవాలంటే.. క్రెడిట్‌ నివేదికను కనీసం ఏడాదికోసారైనా పరిశీలించాలి. ప్రస్తుతం చాలా సంస్థలు ఈ రిపోర్టును ఉచితంగానే అందిస్తున్నాయి. సిబిల్‌ లాంటి బ్యూరోలు ఏడాదికోసారి ఉచితంగా ఇస్తాయి. ఈ నివేదికను తీసుకొని పరిశీలించాలి. క్రెడిట్‌ కార్డులను ఎక్కువగా వాడుతుంటే.. ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

అవసరం ఉంటేనే క్రెడిట్‌ కార్డులు తీసుకోండి:

కొందరు అవసరం లేకపోయినా పదేపదే అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులను తీసుకుంటుంటారు. అలా క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం పొరపాటేనని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అప్పుల కోసం అధికంగా ప్రయత్నిస్తున్నారనే భావన వస్తుంది. ఇదీ మీ క్రెడిట్‌ స్కోరును దెబ్బతీసే అంశమే. ఏదేని దరఖాస్తును తక్కువ క్రెడిట్‌ స్కోరుందని బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు తిరస్కరిస్తే… స్కోరు మరింతగా దిగజారుతుంది. నిజంగా రుణం కావాలని అనుకున్నప్పుడే.. ఒకటి, రెండు సంస్థలనే సంప్రదించండి.

క్రెడిట్‌ కార్డు ఉపయోగించడంలో జాగ్రత్త..

క్రెడిట్‌ కార్డులను వినియోగించడంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. మొత్తం పరిమితిని ఉపయోగిస్తే.. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.50వేల వరకూ ఉందనుకుందాం.. గరిష్ఠంగా దీన్ని రూ.20వేలకు మించి వాడకూడదు. అంటే.. 30-40 శాతం లోపే వినియోగించాలి. ఒకవేళ నెలనెలా అధిక మొత్తంలో కార్డును ఉపయోగిస్తే.. అధిక రుణ పరిమితి ఉన్న క్రెడిట్‌ కార్డును తీసుకోండి. లేదా మరో బ్యాంకు నుంచి కార్డును తీసుకునే ప్రయత్నం చేయాలి.

ఒకే రుణంగా..

రెండు మూడు అప్పులు.. క్రెడిట్‌ కార్డు బాకీలు ఉన్నప్పుడు… వాటన్నింటినీ.. ఒకే చోటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకూ చిన్న మొత్తాలతో ఉన్న అప్పులను తీర్చే ప్రయత్నం చేయండి. ఇలా సాధ్యం కాకపోతే.. ఈ అప్పులన్నీ తీర్చేందుకు ఒక పెద్ద రుణం తీసుకోవడం మంచిది. దీనివల్ల అధిక వడ్డీ ఉన్న రుణాల నుంచి మీకు విముక్తి దొరుకుతుంది. అప్పుల సంఖ్య పెరిగితే.. మీ క్రెడిట్‌ స్కోరు తగ్గుతుందని గుర్తించుకోవాలి. అందుకే క్రెడిట్‌ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల నుంచి తీసుకున్న మొత్తాన్ని సకాలంలో చెల్లించడం ఉత్తమం. లేకపోతే మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గి భవిష్యత్తులో తీసుకునే రుణాలపై ప్రభావం పడుతుంది.

ఇవీ కూడా చదవండి: Bank Loan: మీరు బ్యాంకులో రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ పెట్టుబడులను హామీగా చూపించవచ్చు

Michelin Tires: ఈ టైర్లు పంక్చర్‌ కావట.. 3డీ ప్రింటింగ్‌తో తయారు.. పూర్తి వివరాలు..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!