Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అంటే ఏమిటి?.. బిల్లు చెల్లింపుల గడువు అర్థం కావడం లేదా? ఇలా చెక్‌ చేసుకోండి!

మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే ప్రతి నెలా దాని స్టేట్‌మెంట్‌ను పొందవలసి ఉంటుంది. మీ కార్డ్ స్టేట్‌మెంట్ కొందరికి అర్థం కాదు. ప్రతి నెలా మీ కార్డ్‌లోని లావాదేవీ వివరాలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్..

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అంటే ఏమిటి?.. బిల్లు చెల్లింపుల గడువు అర్థం కావడం లేదా? ఇలా చెక్‌ చేసుకోండి!
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2022 | 1:41 PM

మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే ప్రతి నెలా దాని స్టేట్‌మెంట్‌ను పొందవలసి ఉంటుంది. మీ కార్డ్ స్టేట్‌మెంట్ కొందరికి అర్థం కాదు. ప్రతి నెలా మీ కార్డ్‌లోని లావాదేవీ వివరాలు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ రూపంలో వస్తాయి. అందులో చాలా వివరాలు ఉన్నాయి. దీన్ని చూడటం ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులోని లోపాన్ని సులభంగా గుర్తించవచ్చు. మీరు వాడుకున్న డబ్బును స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఖర్చు చేశారని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఏదైనా అనుమానం ఉండే వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఒక వేళ మీరు నెట్‌ బ్యాంకింగ్‌లో కూడా చెక్‌ చేసుకోవచ్చు. మీ బిల్లు ఎప్పుడు జనరేట్‌ అవుతుందా..? బిల్లు చెల్లించేందుకు చివరి తేదీ ఎప్పుడు అనే వివరాలు కనిపిస్తాయి. చాలా మందికి బిల్లు చెల్లించేందుకు ఎప్పుడు చివరి తేదీ అనే విషయాలు పెద్దగా గమనించి ఉండరు. క్రెడిట్‌ కార్డులను ఎక్కువగా వాడేవారికి అవగాహన ఉంటుంది. కొత్తగా కార్డు తీసుకున్న వారికి అవగాహన ఉండకపోవడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. గడువు తేదీ ముందస్తుగా గుర్తించుకోకపోవడంతో వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల అనదపు ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ని స్టేట్‌మెంట్ సైకిల్ అని కూడా అంటారు. క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ అయిన రోజు నుండి బిల్లింగ్ సైకిల్ ప్రారంభమవుతుంది. బిల్లింగ్ సైకిల్ వ్యవధి 28 నుండి 32 రోజుల వరకు ఉంటుంది.

చెల్లింపు గడువు తేదీ: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపునకు ఇదే చివరి తేదీ. ఈ తేదీ తర్వాత చేసే చెల్లింపులపై రెండు రకాల ఛార్జీలు ఉన్నాయి. ముందుగా బకాయి మొత్తం చెల్లించాలి. లేదా ఆలస్య చెల్లింపు రుసుము చెల్లించాలి. దీనిని మినిమమ్‌ అమౌంట్‌ కూడా అంటారు. ఇది చెల్లిస్తే మీకు వచ్చే బిల్లు వరకు వాడుకున్న బాకాయిని చెల్లించవచ్చు. అప్పటి వరకు మీకు ఎలాంటి అదనపు రుసుము పడదని గుర్తించుకోవాలి. మీరు ప్రతి నెలా మొత్తం బకాయి మొత్తాన్ని చెల్లించాలి. తద్వారా అదనపు ఛార్జీలు ఉండవు. మొత్తం మొత్తంలో బిల్లింగ్ సైకిల్ సమయంలో అయ్యే ఛార్జీలతో పాటు అన్ని ఈఎంఐలు ఉంటాయి. మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో 3 రకాల పరిమితులను పొందుతారు. ఇందులో మొదటిది మొత్తం క్రెడిట్ పరిమితి, రెండవది అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి, మూడవది నగదు పరిమితి. స్టేట్ మెంట్ విభాగంలో మీ క్రెడిట్ కార్డ్ ఖాతాలో ఎంత డబ్బు వచ్చింది అనే వివరాలు, ఎంత ఖర్చు చేయబడింది అనే పూర్తి సమాచారం ఉంది.

ఇవి కూడా చదవండి

రివార్డ్ పాయింట్: క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో మీరు ఇప్పటివరకు సేకరించిన రివార్డ్ పాయింట్‌లతో పాటు దాని స్థితిని కూడా చూడవచ్చు. మునుపటి సైకిల్ నుండి సంపాదించిన రివార్డ్ పాయింట్‌ల సంఖ్య, ప్రస్తుత బిల్లింగ్ సైకిల్‌లో సంపాదించిన పాయింట్‌లు, పాయింట్‌ల గడువు ముగిసే వివరాలు కనిపిస్తాయి.

ఆలస్యంగా చెల్లిస్తే.. మీరు క్రెడిట్‌ కార్డులోని డబ్బులు వాడకున్న తర్వాత గడువు తేదీలోగా చెల్లింపులు చేయాలి. లేదంటే మీకు భారీగా వడ్డీ పడుతుంది. దీని వల్ల మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది పూర్తి బకాయిలు చెల్లించకుండా మినిమమ్‌ అమౌంట్‌ మాత్రమే చెల్లిస్తారు. ఇలా చేయడం సరైంది కాదు. దీని వల్ల మీరు చాలా నష్టపోతారు. వాడుకున్న డబ్బును గడువులోగా మొత్తం చెల్లించేలా ప్లాన్‌ చేసుకోండి. లేకపోతే బ్యాంకులు మీకు అదనపు ఛార్జీలు వేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆలస్య చెల్లింపుపై దాదాపు1000 రూపాయల వరకు కూడా ఉండవచ్చు. మీరు చెల్లించే బకాయిని బట్టి బ్యాంకు వారు ఛార్జీలను వేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి