Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం.. సరికొత్త సేవను ప్రారంభించిన ఇండియన్‌ రైల్వే

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం పలు రకాల సేవలను అందిస్తోంది. అయితే రైల్వే శాఖ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు ప్రయానికులకు..

IRCTC: రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం.. సరికొత్త సేవను ప్రారంభించిన ఇండియన్‌ రైల్వే
Indian Railway Irctc
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2022 | 7:32 AM

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం పలు రకాల సేవలను అందిస్తోంది. అయితే రైల్వే శాఖ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు ప్రయానికులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది. మీరు భారతీయ రైల్వే ఉచిత ఆహార సేవను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీరు ప్రతి రైలులో ఈ సౌకర్యాన్ని పొందలేరు. ఈ సదుపాయం కొన్ని ప్రత్యేక రైళ్ల ప్రయాణికులకు మాత్రమే. రైల్వేల ఆధునీకరణ నుంచి ప్రయాణికుల సౌకర్యాల వరకు ప్రతి ఏరియాలోనూ నిరంతర అభివృద్ధి జరుగుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ ఈ పండుగ సీజన్‌లో ప్రయాణికుల కోసం మరో సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వే తన ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్‌లో భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీపావళి, ఛత్ వంటి పండుగల సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని కూడా రైల్వే కల్పిస్తోంది.

భారతీయ రైల్వే ఈ సదుపాయం ప్రతి రైలులోని ప్రయాణికులకు కాదు. దురంతో ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది వంటి లగ్జరీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రైలు రాక లేదా బయలుదేరినప్పుడు ఉచిత ఆహారం ప్రయోజనం అందుబాటులో ఉండదు. అయితే రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తుంటే మీరు ఉచిత ఆహారాన్ని పొందవచ్చు. ఇవే కాకుండా మీరు ఆహారంతో పాటు ఇతర పానీయాలను కూడా పొందవచ్చు.

ఐఆర్‌సీటీసీ కూడా ఆహార సౌకర్యాన్ని కల్పిస్తోంది

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రయాణికుల సౌకర్యార్థం, నాణ్యత కోసం కొత్త వంటశాలలను నిర్మించడం, పాత వాటిని పునరుద్ధరించడం ద్వారా తన ఆహార సేవల మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. IRCTC తన కస్టమర్‌లకు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వాట్సాప్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మీరు యాప్ సహాయంతో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు

రైలులో ఐఆర్‌సీటీసీ యాప్ సహాయంతో మీరు ఇప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం ప్రయాణికులకు వారి పీఎన్‌ఆర్‌ నంబర్ మాత్రమే అవసరం. భారతీయ రైల్వే దీపావళి, ఛత్ కోసం అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇవి ఢిల్లీ నుండి బీహార్, యూపీ నగరాలకు, కొన్ని ఇతర ప్రాంతాలకు నడుపుతోంది. పండుగలకు ఇంటికి వెళ్లడానికి మీకు కన్ఫర్మ్ టికెట్ లభించకపోతే, మీరు ఈ రైళ్లలో బుక్ చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి