- Telugu News Photo Gallery LPG Gas Cylinder Code means what is the meaning of the number written on the gas cylinder
Gas Cylinder: మీ ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్‌పై ఎక్స్‌పయిరీ డేట్‌ను గమనించారా..? ఎలా గుర్తించాలి?
అందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్‌లను వాడుతుంటారు. అయితే సిలిండర్లపై కొన్నింటిని మనం పెద్దగా గమనించము. ... దానిన గమనించడం ఎంతో ముఖ్యం.
Updated on: Oct 23, 2022 | 12:39 PM

అందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్‌లను వాడుతుంటారు. అయితే సిలిండర్లపై కొన్నింటిని మనం పెద్దగా గమనించము. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్‌కు ఎక్సపయిరీ తేదీ కూడా ఉంటుంది. దానిన గమనించడం ఎంతో ముఖ్యం.

ఎక్స్ పయిరీ గడువు ఎలా తెలుసుకోవడం.. సిలిండర్ పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్ పై A 25 అని ఉందనుకోండి. కచ్చితంగా అదే ఎక్స్ పయిరీ తేదీ. A 25 అంటే జనవరి నుంచి మార్చి, 2025 వరకు అని అర్థం. సిలిండర్ ఆ సంవత్సరం మొదటి త్రైమాసికం చివరితో గడువు తీరిపోతుందని అర్థం.

మార్చి తర్వాత తిరిగి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాతే పంపిణీకి రావాల్సి ఉంటుంది. B అంటే ఏప్రిల్ – జూన్ అని C – అంటే జూలై – సెప్టెంబర్ వరకు అని, D -అంటే అక్టోబర్ – డిసెంబర్ వరకు అని అర్థం.

ఇలా చేస్తే ఎలా తెలుస్తుంది..? కస్టమర్లలో అవగాహన తక్కువే కనుక గ్యాస్ కంపెనీలు గడువు తీరిన వెంటనే అన్ని సిలిండర్లను విధిగా పరీక్షలకు పంపడం అనేది ఎంతో ముఖ్యం. కొన్ని అలా పంపడం లేదనే వాదన ఉంది. వెసులుబాటును బట్టి పంపిస్తుంటారు.

ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత.. పైన సీల్ ను చెక్ చేసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎటువంటి క్రాక్స్ ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయి. క్యాప్ తెరచి లీకేజీ ఉందేమో పరీక్షించాలి. వేలితో వాల్వ్ ను మూసి ఉంచినట్టయితే.. లీకేజీ ఉంటే లీక్ అయిన గ్యాస్ వేలిని పైకి నెడుతుంది. లీకేజీ ఉంటే కనుక ఆ సిలిండర్ ను తీసుకోవద్దు. అలాగే, గడువు దాటిన సిలిండర్‌ను కూడా తీసుకోవద్దు.





























