క్రెడిట్ కార్డు వాడటం వల్ల లాభమా.. నష్టమా? అసలు బ్యాంకులు ఈ కార్డులను ఎందుకు జారీ చేస్తాయో తెలుసా.. ఒక్కసారి పరిశీలించండి..

Credit Card Advantages: క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య

క్రెడిట్ కార్డు వాడటం వల్ల లాభమా.. నష్టమా? అసలు బ్యాంకులు ఈ కార్డులను ఎందుకు జారీ చేస్తాయో తెలుసా.. ఒక్కసారి పరిశీలించండి..
Follow us

|

Updated on: Feb 24, 2021 | 5:03 AM

Credit Card Advantages: క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే వస్తోంది. క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డులతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే తెలివిగా కార్డులను ఉపయోగిస్తేనే ఈ ప్రయోజనాలు పొందొచ్చు. లేదంటే చిక్కుల్లో పడతాం.

క్రెడిట్ కార్డులను దాదాపుగా చాలా చోట్లు ఉపయోగించొచ్చు. చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి లావాదేవీలపై రివార్డు పాయింట్లను పొందొచ్చు. వీటిని రిడీమ్ చేసుకొని వోచర్లను పొందొచ్చు. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సదుపాయం కూడా ఉంది. ఏ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లైనా డబ్బులు తీసుకోవచ్చు. 40 నుంచి 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ సౌకర్యం ఉంది. ఎప్పుడు అవసరం అయినా కార్డును ఉపయోగించొచ్చు.

టైమ్ లిమిట్ అంటూ ఉండదు. ఆకర్షణీయ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్స్ కూడా పొందొచ్చు. క్రెడిట్ కార్డుపై ఉపయోగించని క్రెడిట్ లిమిట్‌పై ఈ లోన్ తీసుకోవచ్చు. లేదంటే ట్రాక్ రికార్డ్ ప్రాతిపదికన కూడా లోన్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్, ఫ్రిజ్, టీవీ లేదంటే ఇతర ప్రొడక్టులు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినప్పుడు, వాటిని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. విదేశాల్లో కూడా క్రెడిట్ కార్డులను ఉపయోగించొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉంటే.. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం కూడా లభిస్తుంది.

అయితే క్రెడిట్ కార్డు బిల్లు గడువు దాటిందంటే బ్యాంకులు అధిక వడ్డీని విధిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ కొనుగోళ్లు చేసినప్పుడు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓటీపీ రాకుండా కొనుగోళ్లు జరుగుతాయి. క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగిస్తూ, బిల్లు నిర్ణీత గడువులోగా క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే అప్పుడు క్రెడిట్ లిమిట్ పెరుగుతూ వస్తుంది.

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? ఇందులో ఉండే ఈఎంఐ ఆప్షన్ వల్ల ఎన్ని లాభాలో..