Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? ఇందులో ఉండే ఈఎంఐ ఆప్షన్ వల్ల ఎన్ని లాభాలో..

క్రెడిట్ కార్డుతో ఎన్నో లాభాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ కార్డు వల్ల ఉండే లాభాలు అందరికంటే ఎక్కుగా ఆన్‏లైన్ షాపింగ్ చేసేవారికి ఎక్కువగా తెలుస్తోంది.

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? ఇందులో ఉండే ఈఎంఐ ఆప్షన్ వల్ల ఎన్ని  లాభాలో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2021 | 7:24 PM

Benefits for Credit Cards: క్రెడిట్ కార్డుతో ఎన్నో లాభాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ కార్డు వల్ల ఉండే లాభాలు అందరికంటే ఎక్కుగా ఆన్‏లైన్ షాపింగ్ చేసేవారికి ఎక్కువగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ కార్డు వల్ల రివార్డు పాయింట్లు, అదనపు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. వీటితోపాటు క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా ఉండే లాభాలెంటో తెలుసుకుందామా..

ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందు దానికి సరిపడా నగదు ఉండకపోవచ్చు. కానీ ఆ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఈఎంఐ రూపంలోకి మార్చుకొని ప్రతి నెల కొంత చెల్లించుకోవచ్చు. ఒకేసారి అంత మొత్తాన్ని కట్టలేని వారు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

అలాగే వ్యాపారులు, ఈ కామర్స్ సంస్థలు, స్టోర్లు క్రెడిట్ కార్టులపై రకరకాల ఆఫర్లను అందిస్తుంటాయి. కంపెనీలు, మర్చంట్లు బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారు. దీంతో ఈఎంఐ కొనుగోళ్లపై ఎక్స్‏క్లూజివ్ ఆఫర్లు అందిస్తుంటారు.

సాధరణంగా క్రెడిట్ కార్డు బిల్లును సరైన సమయానికి చెల్లించకపోతే దానిపై అదనపు ఛార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. 49 శాతం వరకు వడ్డీ పడుతుంది. కనీస బ్యాలెన్స్ అమౌంట్ కట్టకపోయినా కూడా పేమెంట్ చార్జీల కింద రూ.1,300 నుంచి రూ.1,500 వరకు చెల్సించాల్సి వస్తుంది. ఒకవేళ బిల్లు కట్టకపోతే ఆ బిల్లు మొత్తాన్ని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. ఇలా చేస్తే దాదాపు 11 నుంచి 24 శాతం వరకు వడ్డీ పడుతుంది. పెనాల్టీ కట్టడం కన్నా ఈఎంఐ ఆప్షన్ ఎంతో మంచిది. దీంతోపాటు క్రెడిట్ కార్డు ద్వారా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఈ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ వలన వడ్డీ పడదు. అంతేకాకుండా వడ్డీ మొత్తాన్ని ఆఫర్ రూపంలో తిరిగి పొందవచ్చు. ఇక క్రెడిట్ కార్డుపై ప్రిఆప్రూవ్డ్ లోన్ ఆఫర్లు కూడా ఉంటాయి. వీటితో డబ్బులు నేరుగా అకౌంట్లో పడతాయి. ఆ తర్వాత ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఈ లోన్ అమౌంట్ చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

Also Read:

తక్కువ పెట్టుబడితో రూ.2.50 లక్షలు సంపాదించవచ్చు.. ఈ వ్యాపారం చేస్తే ఇట్టే లక్షాధికారులైపోతారు తెలుసా..