AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి.. ప్రత్యేకతలేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

YouTube New Feature:ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత షార్ట్ వీడియో ప్లాట్‌ఫాంలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రాం ‘రీల్స్’పేరుతో టిక్‌టాక్‌ లాంటి ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూట్యూబ్ ‘షార్ట్స్’పేరుతో

యూట్యూబ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి.. ప్రత్యేకతలేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
uppula Raju
|

Updated on: Feb 03, 2021 | 7:13 PM

Share

YouTube New Feature:ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత షార్ట్ వీడియో ప్లాట్‌ఫాంలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రాం ‘రీల్స్’పేరుతో టిక్‌టాక్‌ లాంటి ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూట్యూబ్ ‘షార్ట్స్’పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను గతేడాదే ఇంట్రడ్యూస్ చేసింది. దీంతో 15 సెకన్ల నిడివి ఉండే వీడియోను అప్‌లోడ్ చేసే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. యూట్యూబ్ ‘క్లిప్స్‌’గా పిలుస్తున్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఫీచర్ విశేషాలు ఇలా ఉన్నాయి.

‘యూట్యూబ్ క్లిప్స్’ప్రస్తుతం బెటా వెర్షన్‌లో ఉండగా, పరిమిత సంఖ్యలో కొంతమంది వినియోగదారులతో పాటు, కొన్ని గేమింగ్ చానల్స్‌కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా తగిన మార్పులు చేసి త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు యూట్యూబ్ వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలను షేర్ చేయాలంటే, యూఆర్‌ఎల్ ఉపయోగించి మాత్రమే చేసేవాళ్లు. అంతేకాదు ఆ క్లిప్ ఎక్కడ నుంచి మొదలవుతుందో అక్కడి నుంచే దాన్ని సెండ్ చేయడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఫీచర్ సాయంతో వీడియోలు, లైవ్ స్ట్రీమ్స్‌ను మనకు ఇష్టమైన చోటు నుంచి కట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ 5 సెకన్ల నిడివి నుంచి 60 సెకన్ల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, వెబ్ వెర్షన్‌లకు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో ఐవోఎస్ కస్టమర్స్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఏదైనా వీడియో ఓపెన్ చేసినా తర్వాత, వీడియో క్లిప్ ఐకాన్ కింద కత్తెర సింబల్ కనిపిస్తే, బెటా వెర్షన్ మీకు అందుబాటులోకి వచ్చినట్లు. ఒకవేళ సీజర్ సింబల్ కనిపిస్తే, దాని మీద క్లిక్ చేస్తే..‘క్రియేట్ క్లిప్’ కనిపిస్తుంది. ఆ వీడియో క్లిప్‌లో తమకు ఇష్టమైన పార్ట్‌ను 5 నుంచి 60 సెకన్ల నిడివి మధ్యలో కట్ చేసుకుని ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు.

బామ్మ నోట బంగారం లాంటి పాట.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిన 110 ఏళ్ల బామ్మ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో