AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real estate: రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నారా..? జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..!

భారతీయ సంప్రదాయంలో పండగలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. దసరా, దీపావళి, హోలీ.. ఇలా ఏ పండగ వచ్చినా అందరూ సొంత గ్రామానికి చేరుకుని సంబరాలు చేసుకుంటారు. అలాగే పండగల రోజు కొత్త పని చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యమిస్తారు.

Real estate: రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నారా..? జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..!
Real Estate
Nikhil
|

Updated on: May 13, 2025 | 5:00 PM

Share

నేడు భూమి విలువ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ వాటిని కొనడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. అయితే ఈ రంగంలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని అంశాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాథమిక అంశాలు

రియల్ ఎస్టేట్ సంస్థలు తమ భూములను కొనుగోలు చేసేవారికి అనేక ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. వాటినే కాకుండా కొన్ని ప్రాథమిక అంశాలపై కొనుగోలుదారులు అవగాహన పెంచుకోవాలి. భూమి ఉన్న ప్రదేశం, డెవలపర్ ట్రాక్ రికార్డు, ఆమోదాలు, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ వంటి వాటిని చూసుకోవాలి. ప్రస్తుతం టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. తక్కువ ఈఎంఐలు, నో కాస్ట్ డౌన్ పేమెంట్, ప్రత్యేక పండగ పథకాలను అందజేస్తున్నారు.

పన్ను ప్రయోజనాలు

రియల్ ఎస్టేట్ లోని పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని మినహాయింపులు లభిస్తాయి. హౌసింగ్ రుణాలు, వాటి చెల్లింపులను కొనుగోలుదారులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెట్టుబడి పెడితే రాబోయే ఏడాాదిలో పన్ను ప్రయోజనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

జీతాల పెరుగుదల

వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జీతాలు పెరుగుతాయి. ఆ పెరిగిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడితే బాగుంటుంది. మీకు ఇష్టమైన పండగ రోజు ఈ నిర్ణయం తీసుకుంటే.. మీకు ధీర్థకాలంలో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ ఆర్థిక క్రమశిక్షణతో మీరు కొంత కాలానికి సొంతింటి వారవుతారు.

అవగాహన

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, ఇళ్ల కొనుగోలు తదితర విషయాలపై వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ముందుగా మార్కెట్ పరిస్థితులు, భూమి విలువ తదితర వాటిపై అవగాహన పెంచుకోవాలి. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ కస్టమర్లకు బంగారు నాణేలు తదితర వివిధ బహుమతులు అందిస్తాయి. అయితే భూమి విలువ, అనుకూలమైన ఫైనాన్సింగ్ నిబంధనలు, పారదర్శక లావాదేవీలు తదితర వాటిని కొనుగోలుదారులు ఆలోచించాలి. తాము పెట్టిన పెట్టుబడికి ధీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చేలా ఉండాలి. కాబట్టి భూమి విలువ, మార్కెట్ పరిస్థితులపై అవగాహన పెంచుకుని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి