Hyperloop Train: 4 గంటల ప్రయాణం కేవలం 25 నిమిషాల్లోనే.. త్వరలో హైపర్‌లూప్ రైలు
Hyperloop Train: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం Xలో ఒక వీడియోను షేర్ చేస్తూ, హైపర్‌లూప్ ప్రయాణ మార్గాల్లో ఆధునిక మార్పులను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. ఐఐటీ మద్రాస్‌కు రెండుసార్లు ఒక్కొక్కరికి..

భారతదేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ ప్రాజెక్ట్ ముంబై – పూణే మధ్య ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ దూరం 3-4 గంటల్లో చేరుకుంటుంది. అయితే హైపర్‌లూప్ ద్వారా ఈ ప్రయాణం కేవలం 25 నిమిషాల్లో పూర్తవుతుంది. నివేదిక ప్రకారం, 24 నుండి 28 మంది ప్రయాణికులు ఒక పాడ్‌లో కూర్చోవచ్చు. హార్డ్ట్ హైపర్‌లూప్ మొదటి విజయవంతమైన పరీక్ష 2019లో జరిగింది.
హైపర్‌లూప్ అనేది ఒక హై-స్పీడ్ రైలు. ఇది ఒక ట్యూబ్‌లోని వాక్యూమ్‌లో నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు వెయ్యి కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో పాడ్‌లు వాక్యూమ్ ట్యూబ్ లోపల అయస్కాంత సాంకేతికతతో నడుస్తాయి. ఈ వ్యవస్థలో శక్తి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇది దాదాపు జీరో పోల్యూషన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం Xలో ఒక వీడియోను షేర్ చేస్తూ, హైపర్‌లూప్ ప్రయాణ మార్గాల్లో ఆధునిక మార్పులను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. ఐఐటీ మద్రాస్‌కు రెండుసార్లు ఒక్కొక్కరికి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇచ్చామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మూడవసారి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ హైపర్‌లూప్ ప్రారంభంతో 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు అని అన్నారు. స్పానిష్ కంపెనీ గెల్రాస్ హైపర్‌లూప్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. యూరోపియన్ నగరాలను గంటకు 1000 కి.మీ వేగంతో అనుసంధానించడం దీని లక్ష్యం.
బెంగళూరు-చెన్నై మధ్య హైపర్‌లూప్ రైలును నడపడానికి రైల్వేలు ఒక ప్రణాళికపై పని చేస్తున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఐటీ మద్రాస్ ఈ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దూరాన్ని కేవలం 30 నుండి 40 నిమిషాల్లోనే అధిగమించవచ్చు. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ హైపర్‌లూప్ ఆధారిత మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేస్తోంది. 2025 నాటికి గంటకు 1000 కి.మీ. వేగంతో చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.
ఇది కూడా చదవండి: Schools Reopen: కీలక నిర్ణయం.. విద్యార్థులు మళ్లీ బడిబాట.. తెరుచుకోనున్న విద్యాసంస్థలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి