CNG Bike: ఇక మార్కెట్లోకి సీఎన్‌జీ బైక్‌లు కూడా.. విడుదలకు సిద్ధమవుతోన్న..
అయితే సీఎన్‌జీ కేవలం త్రీ వీల్స్, ఫోర్ వీల్స్ వాహనాలకు మాత్రమే పరిమితమనే విషయం తెలిసిందే. అయితే త్వరలోనే సీఎన్‌జీ బైక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అవును మీరు చదివింది నిజమే.. త్వరలోనే భారత మార్కెట్లోకి సీఎన్‌జీ బైక్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది బబాజ్. ఇప్పటికే ఈ సంస్థ వాహనాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. బ్రుజెర్ ఈ101 కోడ్ నేమ్‌తో రానున్న...

ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్‌తో నడిచే బైక్‌లు మాత్రమే అందుబాటలో ఉన్నాయి. అయితే పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పెద్ద వాహనాల విషయానికొస్తే సీఎన్‌జీ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్‌తో పోల్చితే భారీగా ధర తక్కువ ఉండడంతో చాలా మంది సీఎన్‌జీని ఇష్టపడుతున్నారు.
అయితే సీఎన్‌జీ కేవలం త్రీ వీల్స్, ఫోర్ వీల్స్ వాహనాలకు మాత్రమే పరిమితమనే విషయం తెలిసిందే. అయితే త్వరలోనే సీఎన్‌జీ బైక్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అవును మీరు చదివింది నిజమే.. త్వరలోనే భారత మార్కెట్లోకి సీఎన్‌జీ బైక్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది బబాజ్. ఇప్పటికే ఈ సంస్థ వాహనాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. బ్రుజెర్ ఈ101 కోడ్ నేమ్‌తో రానున్న ఈ కొత్త సీఎన్‌జీ బైక్‌కు సంబంధించి ఔరంగాబాద్‌లోని ఫ్యాక్టరీలో తయారీ జరుగుతున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఈ బైక్‌ను అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ప్లాటినా పేరుతో ఈ బైక్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది. ఆటో మొబైల్ రంగంలో ఇదొక మైలురాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సీఎన్‌జీ బైక్ విషయమై బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే దిశలో భాగంగా సీఎన్‌జీ బైక్‌ని తీసుకురావాలని బజాన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ఏడాది 1.2 లక్షల వరకు బైక్‌లను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది బజాజ్. అనంతరం మార్కెట్లో ఉండే డిమాండ్ ఆధారంగా ఈ సంఖ్యను ఏడాదికి 2 లక్షల వరకు పెంచొచ్చనే ఆలోచనలో కంపెనీ ఉంది. ఇక పెట్రోల్‌తో పోల్చితే సీఎన్‌జీ ధర తక్కువ కావడం, మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుండడంతో ఈ బైక్‌లకు మార్కెట్లో తిరుగుండదని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఈ సీఎన్‌జీ బైక్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎలా ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే కంపెనీ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..