AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policy: క్షణాల్లో ఎల్‌ఐసీ పాలసీ స్టేటస్‌ చెకింగ్‌.. ఎల్‌ఐసీ ఈ సర్వీసెస్‌తోనే సాధ్యం

ఎల్‌ఐసీ బీమా పాలసీలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కొన్ని నిర్ధిష్ట విధానాలను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎల్‌ఐసీ ఈ-సర్వీసెస్‌లో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు మీ ఎల్‌ఐసీ పాలసీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. చాలా మంది ఈ విషయంపై అలసత్వం వహించడం వల్ల జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఒకప్పుడు ఎల్‌ఐసీ బ్రాంచ్ లొకేషన్‌లలో వ్యక్తిగతంగా మాత్రమే అందించబడిన ఈ ఈ-సేవలు ఇప్పుడు అనేక ఫీచర్లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

LIC Policy: క్షణాల్లో ఎల్‌ఐసీ పాలసీ స్టేటస్‌ చెకింగ్‌.. ఎల్‌ఐసీ ఈ సర్వీసెస్‌తోనే సాధ్యం
Lic Policy
Nikhil
|

Updated on: Feb 04, 2024 | 7:45 PM

Share

జీవిత బీమాతో కలిగే ప్రయోజనాలపై ఇటీవల కాలంలో అందరూ తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే అధికంగా జీవిత బీమా పాలసీలు తీసుకుంటున్నారు. చాలా మంది జీవిత బీమా పాలసీలో ఎల్‌ఐసీలోనే తీసుకుంటారు. అయితే పాలసీను తీసుకోవడం ఎంత ముఖ్యమో? ఎప్పటికప్పుడు పాలసీ స్టేటస్‌ను తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ బీమా పాలసీలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కొన్ని నిర్ధిష్ట విధానాలను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎల్‌ఐసీ ఈ-సర్వీసెస్‌లో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు మీ ఎల్‌ఐసీ పాలసీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. చాలా మంది ఈ విషయంపై అలసత్వం వహించడం వల్ల జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఒకప్పుడు ఎల్‌ఐసీ బ్రాంచ్ లొకేషన్‌లలో వ్యక్తిగతంగా మాత్రమే అందించబడిన ఈ ఈ-సేవలు ఇప్పుడు అనేక ఫీచర్లకు యాక్సెస్‌ను అందిస్తాయి. బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లకుండానే మీ ఎల్‌ఐసీ పాలసీ సమాచారంతో పాటు స్థితిని ఎలా తెలుసుకోవాలో? ఓ సారి చూద్దాం.

ఎల్‌ఐసీ పాలసీ స్టేటస్‌ ధ్రువీకరణ ఇలా

  • లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • హోమ్‌పేజీలో “కస్టమర్ సర్వీసెస్” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • “కస్టమర్ సర్వీసెస్” ట్యాబ్ కింద పాలసీ స్టేటస్‌ను ఎంచుకోవాలి.
  • యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత మీ పాలసీ వివరాలు, ప్రస్తుత స్థితిని వీక్షించాలి. మీకు ఎక్కువ పాలసీలు ఉంటే మీరు ఎల్‌ఐసీకు చెందిన ఈ-సర్వీసెస్ టూల్స్ విభాగంలో ‘ఎన్‌రోల్ పాలసీ’ ఎంపికను ఉపయోగించి వాటిని జోడించవచ్చు.
  • పాలసీ నంబర్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఎల్‌ఐసీ పాలసీ స్థితి వివరాలను తనిఖీ చేయవచ్చు. పాలసీ పేరు, టర్మ్, టేబుల్ నంబర్, తదుపరి ప్రీమియం గడువు తేదీ, హామీ మొత్తం వంటి పాలసీ వివరాలు ప్రదర్శితమవుతాయి.

కొత్త యూజర్లు తనఖీ చేయడం ఇలా

  • ఎల్‌ఐసీ హోమ్ పేజీలో ఈ-సర్వీసెస్‌ కోసం నమోదు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించి, ఎల్‌ఐసీ లాగిన్ ఆధారాలను సృష్టించుకోవాలి.
  • అందించిన ఈ-మెయిల్ లింక్ ద్వారా నమోదును నిర్ధారించాలి.
  • పాలసీ నంబర్, పుట్టిన తేదీ, ప్రీమియం మొత్తం మొదలైన వివరాలను నమోదు చేసి, సమర్పించు క్లిక్ చేయడం ద్వారా మీ పాలసీని నమోదు చేయవచ్చు.

రిజిస్ట్రేషన్‌కు ఇవి మస్ట్‌

  • మీ పేరు మీద చెల్లుబాటు అయ్యే ఎల్‌ఐసీ ఉండాలి.
  • సేవా పన్ను లేకుండా వాయిదాల ప్రీమియంలు చెల్లించి ఉండాలి
  • పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వంటి వివరాలను ఉంచుకోవాలి.
  • హెచ్చరికల కోసం చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌తో పాటు ఈ-మెయిల్‌

ఎల్‌ఐసీ పాలసీ నమోదు 

  • రిజిస్ట్రేషన్‌ను సమర్పించిన తర్వాత ఆన్‌లైన్ ఎల్‌ఐసీ పాలసీ నమోదు ఫారమ్‌ను పొందడానికి “అవును” క్లిక్ చేయాలి.
  • ప్రతి పాలసీకి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • నమోదు సమయంలో లేదా తర్వాత లాగిన్ చేయడం ద్వారా ప్రింటవుట్ తీసుకోండి.
  • ఫారమ్‌పై సంతకం చేసి, రసీదు కోసం పేర్కొన్న సమీప ఎల్‌ఐసీ బ్రాంచ్‌కి సమర్పించాలి.

గుర్తుంచుకోవాల్సిన వివరాలు

  • అవసరమైన తనిఖీల తర్వాత పాలసీల ధ్రువీకరణ పూర్తవుతుంది.
  • నిర్దిష్ట కార్యాచరణలకు అధీకృత యాక్సెస్ కోసం నమోదు అవసరం.
  • పాలసీలు వార్షిక ప్రీమియం చెల్లింపులపై ఆధారపడి ఉంటాయి కానీ కొంచెం అదనపు ఛార్జీతో నెలవారీ, త్రైమాసికం లేదా సగం వార్షికంగా చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి