AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flex Fuel: ఇందన యాతనలకు ఇథనాల్‌తో చెక్‌.. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ద్వారా నడిచే కార్లను రిలీజ్‌ చేసిన టయోటా

పెట్రోల్‌ కార్లతో వెలువడే కాలుష్యం వల్ల అనేక పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ రహిత ఇందనంతో నడిచే వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇథనాల్‌ సాయంతో నడిచే వాహనాలపై దృష్టి పెట్టాలని కార్ల తయారీ కంపెనీలు చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన టయోటా ఇథనాల్‌తో నడిచే కార్లను రిలీజ్‌ చేసింది.

Flex Fuel: ఇందన యాతనలకు ఇథనాల్‌తో చెక్‌.. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ద్వారా నడిచే కార్లను రిలీజ్‌ చేసిన టయోటా
Toyota Flex Fuel Car
Nikhil
|

Updated on: Feb 04, 2024 | 8:15 PM

Share

ప్రస్తుత రోజుల్లో పెట్రోల్‌ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా వాహన నిర్వహణ భారాన్ని పెట్రోల్‌ ధరలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలను కూడా ఈ ధరలు భయపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా పెట్రోల్‌ కార్లతో వెలువడే కాలుష్యం వల్ల అనేక పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ రహిత ఇందనంతో నడిచే వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇథనాల్‌ సాయంతో నడిచే వాహనాలపై దృష్టి పెట్టాలని కార్ల తయారీ కంపెనీలు చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన టయోటా ఇథనాల్‌తో నడిచే కార్లను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో ఈ కార్లను పరిచయం చేసింది. కాబట్టి ఈ కార్ల ఫీచర్లతో పాటు ఇథనాల్‌ కార్ల వల్ల కలిగే మేలును ఓ సారి తెలుసుకుందాం.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టయోటా తన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇన్నోవా హైక్రాస్‌ను ప్రదర్శించింది. ఇది దాని హైబ్రిడ్ ఇన్నోవా హైక్రాస్ అధిక ఇథనాల్ మిశ్రమంతో నడిచేలా సవరించారు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ పవర్‌ట్రెయిన్ అదే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటారుతో పని చేస్తుంది. అయితే ఈ కారు 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుంది. స్టాండర్డ్ ఇన్నోవా హైక్రాస్‌తో పోల్చితే ఈ కారు ఇప్పటికే 60 శాతం విద్యుత్‌తో నడవడం వల్ల తక్కువ ఉద్గారాలను రిలీజ్‌ చేస్తుంది. ఈ కారు హైక్రాస్ ప్రత్యేక ఈవీ మోడ్‌ను కలిగి ఉంది. అయితే ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్ మరింత తక్కువ ఉద్గారాలను రిలీజ్‌ చేస్తుంది.

ఇథనాల్ మిళిత ఇంధనంతో పనిచేయడం వల్ల వివిధ భాగాలతో సహా ఈ ఇంధనంతో నడపగలిగేలా ఈ ఇంజిన్‌లో చాలా మార్పులు చేశారు. కారుకు సంబంధించిన ఫ్యూయల్ పంప్, ఎగ్జాస్ట్, ఇతర ప్రాంతాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ కారు లుక్స్‌ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా ఇంజిన్‌లో మాత్రం గణనీయమైన మార్పులు ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

ఎక్స్‌పోలో టయోటా ఇతర కార్లు

టయోటా కార్లల్లో హైడ్రోజన్‌తో నడిచే మిరాయ్ హైడ్రోజన్‌ను కూడా ప్రదర్శనలో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్‌తో నడిచే కొన్ని కార్లలో ఇది ఒకటి. మిరాయ్ ఒక రాడికల్ డిజైన్‌తోతో లేటెస్ట్‌ ఎడిషన్‌లో చాలా ప్రాక్టికాలిటీతో ఫీచర్లు ఉన్నాయి. అలాగే టయోటా హైరైడర్ సీఎన్‌జీ కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి