Small Savings Schemes: ఆడబిడ్డల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఈ పథకం వడ్డీ రేటు..
రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) వంటి పథకాలు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పరిధిలోకి వస్తాయి. ప్రతి క్వార్టర్ కు ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. డిసెంబర్ 30 నాటికి కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉండగా.. 29నే కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది.

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్న వారు, పెట్టుబడి పెట్టాలనే ఆలోచనల్లో ఉన్న వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రకటన వచ్చేసింది. వాస్తవానికి ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు 2023 డిసెంబర్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం సవరించాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 29నే దీనికి సంబంధించిన కీలక ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. 2024 జనవరి నుంచి మార్చి క్వార్టర్ కు సుకన్య సమృద్ధి యోజన, మూడు సంవత్సరాల టైం డిపాజిట్ పథకానికి సంబంధించిన వడ్డీ రేట్లను పెంచింది. అయితే 2020 ఏప్రిల్ నుంచి ఎటువంటి మార్పులు చేయనిపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథక వడ్డీ రేటు ఈ క్వార్టర్ కు కూడా ఎటువంటి పెరుగదలను చేయలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్..
చిన్న మొత్తాల పొదుపు పథకాలు ప్రజలకు బాగా ఉపయోగపడతాయి. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) వంటి పథకాలు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పరిధిలోకి వస్తాయి. ప్రతి క్వార్టర్ కు ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. డిసెంబర్ 30 నాటికి కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉండగా.. 29నే కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది.
కొత్త వడ్డీ రేట్లు ఇలా..
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో రెండు పథకాలకు మాత్రం ప్రభుత్వం వడ్డీ రేటును పెంచింది. వాటిల్లో సుకన్య సమృద్ధి యోజన, మూడు సంవత్సరాల టైం డిపాజిట్ స్కీమ్లు ఉన్నాయి. వీటి వడ్డీ రేట్లపై 20 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో 2024 జనవరి నుంచి మార్చి క్వార్టర్ కు సుకన్యా సమృద్ధి యోజన స్కీమ్ కింద ఇప్పుడు 8.2శాతానికి చేరింది. అలాగే మూడేళ్ల టైం డిపాజిట్ లో వడ్డీ రేటు 7.1శాతంగా ఉంది. ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు లేవు. అక్టోబర్-డిసెంబర్ 2023లో ఉన్న రేట్లు అలాగే ఉంటాయి. చిన్న పొదుపులపై వడ్డీ రేట్ల నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై మార్కెట్ రాబడులతో ముడిపడి ఉంటుంది. పోల్చదగిన-మెచ్యూరిటీ సెక్యూరిటీల రాబడిపై 0-100 బేసిస్ పాయింట్ల వ్యాప్తిని కలిగి ఉంటుంది. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకం వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వల్ల ప్రయోజనాలు..
- చిన్న మొత్తాల పొదుపు పథకం సాధారణంగా స్థిరమైన, ఊహించదగిన రాబడిని అందిస్తుంది. ఇది సాంప్రదాయిక పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఈ పథకాలు ప్రభుత్వ మద్దతుతో ఉంటాయి. ఎటువంటి రిస్క్ ఉండదు.
- పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని పొందవచ్చు.
- ఈ పొదుపు పథకాలలో పెట్టుబడి మొత్తం కనీసం రూ. 250 నుంచి రూ. 1,000 వరకు ఉంటుంది.
- ఈ చిన్న పొదుపు పథకాలు మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి ఆచరణీయమైన ఎంపికలు.
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద, వ్యక్తులు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. పీపీఎఫ్, ఎస్సీఎస్ఎస్, ఎన్ఎస్సీ, ఎస్ఎస్వై, ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ క్లయిమ్ పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..