కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పథకం కింద చేసే పనులకి డైరెక్ట్‌గా చెల్లింపులు..!

Central Government: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (National Rural Employment Guarantee Act) 2005వ సంవత్సరంలో ప్రారంభించారు.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పథకం కింద చేసే పనులకి డైరెక్ట్‌గా చెల్లింపులు..!
Nrega
Follow us
uppula Raju

|

Updated on: Apr 18, 2022 | 7:26 PM

Central Government: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (National Rural Employment Guarantee Act) 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి 100 రోజుల పని కల్పించడం ఈ పథకం ఉద్దేశ్యం. దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తుంది. అయితే ఇటీవల ఈ పథకం కింద చాలా అవకతవకలు జరిగినట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇందులో మార్పులు చేయడం ప్రారంభించింది. తాజాగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేసే పనులకు ఇకనుంచి కేంద్ర ప్రభుత్వమే నేరుగా బిల్లులు చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీలతో సంబంధం లేకుండా నిర్మాణ సామగ్రి సరఫరాదారుల (వెండర్‌) ఖాతాల్లోకి బిల్లు మొత్తాలు జమ చేయనుంది. కూలీలతో చేయించే పనుల నుంచి గ్రామాల్లో నిర్మాణ పనులకు బిల్లుల చెల్లింపుల వరకు అన్నిటిని మార్చేసింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించిన పోర్టల్‌లో అన్ని వివరాలూ డైరెక్ట్‌గా అప్‌లోడ్‌ చేయాలి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఈ పోర్టల్‌ పని చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థ వచ్చాక ఈ పథకంలో అనేక మార్పులు జరుగుతున్నాయి.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ‘ఉపాధి’ పథకం మెటీరియల్‌ పనులకు నిర్మాణ సామగ్రి సరఫరాదారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు చేపట్టారు. పంచాయతీలు తీర్మానం చేసిన పనులకు వీరు సిమెంట్‌, ఇసుక, ఇనుము, కంకర వంటి సామగ్రి సరఫరా చేస్తారు. పూర్తయిన పనులకు ఇంజినీర్లు లెక్కలు కట్టి బిల్లులు తయారు చేసి ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ మొత్తాలను కేంద్రం నేరుగా సరఫరాదారు ఖాతాలో జమ చేస్తుంది.

కేంద్రం ఈ నిర్ణయంతో సర్పంచుల జోక్యానికి కూడా అడ్డుకట్ట పడింది. ఉపాధి హామీ పథకంలో పంచాయతీల ఆధ్వర్యంలో రహదారులు, కాలువలు, భవన నిర్మాణ పనులు చేస్తారు. వీటిని గుర్తించడం, తీర్మానం చేసి మండల ఇంజినీర్లకు పంపడంలో సర్పంచులు కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో సర్పంచులు తమకు కావలసిన వ్యక్తులను నిర్మాణ సామగ్రి సరఫరాదారుగా చూపించి వారితో పనులు చేయిస్తారు. పూర్తయ్యాక వారి పేర్లుతో బిల్లులు చెల్లిస్తుంటారు. అయితే ఇకనుంచి పనులకు తీర్మానం చేయడం, అవి పూర్తయ్యాక నిర్ధారించడం వరకే సర్పంచులు చేయాలి. బిల్లుల విషయంలో జోక్యం చేసుకోరాదు.

IPL 2022 వేలంలో అతడిని ఎవరూ కొనాలనుకోలేదు.. కానీ ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే..!

IPL 2022: వీరేంద్ర సెహ్వాగ్‌కి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. కోల్‌కతా ఆటగాడి మనసులో మాట..!

Millets Benfits: ఎదిగే పిల్లలకు చిరు ధాన్యాలు బెస్ట్.. ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!