AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: వీరేంద్ర సెహ్వాగ్‌కి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. కోల్‌కతా ఆటగాడి మనసులో మాట..!

IPL 2022: సునీల్ నరైన్ గత 10 సంవత్సరాలుగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక

IPL 2022: వీరేంద్ర సెహ్వాగ్‌కి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. కోల్‌కతా ఆటగాడి మనసులో మాట..!
Virender Sehwag
uppula Raju
|

Updated on: Apr 18, 2022 | 6:15 PM

Share

IPL 2022: సునీల్ నరైన్ గత 10 సంవత్సరాలుగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు. KKR కోసం అతని కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఎవ్వరూ ఆడలేదు. ఓవరాల్‌గా కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్‌ను మించిన అనుభవజ్ఞుడు లేడు. అయితే ఈ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్‌ గురించి పెద్ద ప్రకటన చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కి ముందు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఓ రిపోర్ట్‌ర్ ఇప్పటి వరకు మీ బౌలింగ్‌లో ఏ ఆటగాడు బాగా ఆడేవాడని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా నరైన్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. అంతేకాదు దాని వెనుక ఉన్న కారణాన్ని చెప్పాడు.

సునీల్ నరైన్ మాట్లాడుతూ “నేను వీరేంద్ర సెహ్వాగ్ గురించి చెబుతాను. నా బౌలింగ్‌లో అతడు అత్యుత్తమంగా ఆడేవాడు. ఒక విధంగా చెప్పాలంటే అతడికి బౌలింగ్‌ చేయాలంటే చాలా కష్టమని. ఎందుకంటే పరిస్థితి ఏదైనా కావొచ్చు కానీ అతడి శైలి ఎప్పుడూ దూకుడుగా ఉంటుంది. నిజానికి అది అతడి సహజమైన ఆట తీరు. అందుకే సెహ్వాగ్‌కి బౌలింగ్‌ చేయడం అంత సులభం కాదు” IPL 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి 3 గెలిచింది. ఈ మ్యాచ్‌ల్లో సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పొదుపుగా పరుగులు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో 5 పరుగుల ఎకానమీ వద్ద పరుగులు ఇచ్చాడు.

Millets Benfits: ఎదిగే పిల్లలకు చిరు ధాన్యాలు బెస్ట్.. ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

TSPSC: గ్రూప్స్‌ పోస్టులకి అప్లై చేస్తున్నారా.. ఇలా చేసేవారిపై కఠిన చర్యలు..!

Health News: మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!