Aadhaar Card: ఆధార్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రైవేట్ సంస్థలకు అనుమతి!
Aadhaar Card: ఆధార్‌ను అంత ముఖ్యమైన పత్రంగా పరిగణిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అందులో ఒక పెద్ద మార్పును ప్రకటించింది. భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీలు ప్రజల ఆధార్‌ను యాక్సెస్ చేయగలవు. ప్రైవేట్ కంపెనీలు ప్రజల ఆధార్ వివరాలను యాక్సెస్ చేయడానికి వీలుగా నిబంధనలకు..

భారతీయ పౌరులకు ఆధార్ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. ఆధార్ కార్డులో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తోంది కేంద్రం. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ప్రైవేట్ కంపెనీలు ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించుకోవడానికి అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ కొత్త ప్రకటన ఏంటో చూద్దాం.
ప్రజల జీవితాల్లో ఆధార్ కార్డు కీలక పాత్ర:
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ భారతదేశంలోని ప్రతి పౌరుడికి 12 అంకెల ఆధార్ కార్డును జారీ చేస్తుంది. 12 అంకెల సంఖ్యతో పాటు, ఆధార్ కార్డులో పేరు, వయస్సు, చిరునామా, మొబైల్ నంబర్, వేలిముద్రతో సహా కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుంది. ఆధార్‌లో అంత ముఖ్యమైన వివరాలు ఉన్నందున, దానిని భారత పౌరులకు ముఖ్యమైన గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు.
ఆధార్‌లో కీలక మార్పులు
ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా విభాగం కాకుండా ఏదైనా సంస్థ ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించాలనుకుంటే తప్పనిసరిగా అందుకు కారణాలను కేంద్రానికి గానీ, యూఐడీఏకి గానీ వివరించాలని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ ప్రతిపాదన ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ప్రామాణీకరణ ఎందుకు అవసరమో, అది ప్రజలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో కూడా ప్రైవేట్ సంస్థలు వివరించాల్సి ఉంటుంది. దానిని సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా విభాగానికి పంపాలి. ఏదైనా దుర్వినియోగానికి సంబంధించినవి ఉంటే అనుమతి ఉండదు.
అయితే ఈ ప్రైవేట్ సంస్థలు ఆధార్ యాక్సెస్ చేసేందుకు పలు నిబంధనలు విధించింది కేంద్రం. సంస్థలు ఆధార్ యాక్సెస్ చేసేందుకు కారణాలు ఏమిటి? ఆధార్ వివరాలను పొందాలంటే అందుకు కారణాలు కేంద్ర ప్రభుత్వానికి గానీ, యూఐడీఏఐకి గానీ ప్రైవేట్ సంస్థలు వివరించాలి. అలాగే ఆ వివరాలన్ని కూడా ప్రజలకు సమ్మతమైనవిగా ఉండాలి. కేంద్రం విధించిన నిబంధనలకు సరిగ్గా ఉండాలి. అందులో ఏ ఒక్కటి కూడా వ్యతిరేకంగా ఉంటే కేంద్రం అనుమతి ఇవ్వదు.
ఆధార్ కార్డులపై వేలిముద్రలు, ఐరిస్ వంటి సమాచారాన్ని ఉపయోగించి మోసానికి పాల్పడిన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అంతేకాకుండా, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ వివరాలను యాక్సెస్ చేయడానికి అనుమతించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాలను ఉపయోగించుకునేందుకు అనుమతించినప్పటికీ సుప్రీంకోర్టు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా దానిని నిషేధించింది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇస్తూ నిబంధనలను సవరించింది. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతించే నిర్ణయం ప్రజల వ్యక్తిగత సమాచార రక్షణకు విరుద్ధమని వారు ఖండిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి