AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple intelligence: ఐఫోన్‌లో నయా ఫీచర్.. ఇక ఆ సమస్యలకు చెక్..!

ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే ఫోన్ ఏదంటే ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ అని టక్కున సమాధానం వస్తుంది. నిత్యం మార్కెట్ లోకి అనేక స్పెషల్ ఫీచర్లతో ఫోన్లు విడుదలవుతున్నా ఐఫోన్ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు కూడా ఈ కంపెనీ పేరు సుపరిచితమే. ఆపిల్ కంపెనీ నిత్యం కొత్త ఫీచర్లను అప్ డేట్ చేస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. దానిలో భాగంగా ఆపిల్ ఇంటిలిజెన్స్ అనే ఏఐ ఫీచర్ ను రూపొందించింది. మన దేశంలోని వినియోగదారులకు ఏప్రిల్ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

Apple intelligence: ఐఫోన్‌లో నయా ఫీచర్.. ఇక ఆ సమస్యలకు చెక్..!
Apple Intelligence
Nikhil
|

Updated on: Feb 05, 2025 | 5:00 PM

Share

2025 మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆపిల్ కంపెనీ ఆర్థిక ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ త్రైమాసిక ఆదాయం 124.3 బిలియన్లకు చేరుకుందని, గతేడాదితో పోల్చితే నాలుగు శాతం ఎక్కువని తెలిపారు. అలాగే ఆపిల్ ఇంటిలిజెన్స్ ను ఏప్రిల్ నెలలో భారతదేశంలో ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. అక్కడ స్థానికీరించిన ఇంగ్లిషుతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఆపిల్ ఇంటిలిజెన్స్ ను మరింత ముందుకు తీసుకువెళ్లే విధానంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

టిమ్ కుక్ మాట్లాడుతూ ఐఫోన్ ఇన్ స్టాల్ బేస్ ఆల్ టైమ్ హైకి పెరిగిందని తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో యూఎస్ఏ, చైనా, ఇండియా, యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ లలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో గొప్ప ఫలితాలను సాధించామని, ముఖ్యంగా ఇండియాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ఈ త్రైమాసికంలో అక్కడ ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచిందన్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో నాలుగు కొత్త దుకాణాలను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్, మూడో అతి పెద్ద పీసీ, టాబ్లెట్ల మార్కెట్ గా ఇండియా పేరు గాంచిందన్నారు. ఆపిల్ కంపెనీ కొత్త సీఎఫ్ వో కెవాన్ ఫరేఖ్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ తమ ఫోన్లకు బలమైన డిమాండ్ ఉందన్నారు. దీని కారణంగానే తమ వాటాదారులకు 30 బిలియన్ డాలర్లకు పైగా తిరిగి ఇవ్వడానికి అవకాశం కలిగిందన్నారు.

ఆపిల్ ఇంటిలిజెన్స్ పనిచేయాలంటే తాజాాగా విడుదల చేసిన ఐవోఎస్ 18.2, ఐప్యాడ్ ఓఎస్ 18.2, మ్యాక్ఓఎస్ సెక్యూరియా 15.2 తదితర ఫీచర్లు ఉండాలి. లేకపోతే అప్ డేట్ చేసుకోవాలి. ఈ ఏఐ ఫీచర్ కు ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సపోర్టు చేస్తాయి. అలాగే ఐప్యాడ్ లకు సంబంధించి ఏ17 చిప్, ఎంఐ చిప్ లతో పాటు తర్వాత వచ్చిన లేటెస్ట్ డివైజ్ లతో పనిచేస్తుంది. మ్యాక్స్ ఎంఐ చిప్ లతో పాటు తర్వాత వచ్చిన లేటెస్ట్ డివైజ్ లలో అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
ఇళ్లకు అర్హత పొందని వారి ఖాతాల్లోకి రూ.10 వేలు రిఫండ్..
ఇళ్లకు అర్హత పొందని వారి ఖాతాల్లోకి రూ.10 వేలు రిఫండ్..