Car Fire Insurance: మీ కారు మంటల్లో కాలిపోతే ఇన్సూరెన్స్ వస్తుందా? క్లెయిమ్ ఎలా చేయాలి? రూల్స్ తెలుసా?
Car Fire Insurance Claim: కార్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. ఒకవేళ మీ కారుకు ఇలాంటి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం చెల్లిస్తాయా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే పూర్తి వివరాలతో కూడిన కథనంలో తెలుసుకుందాం..

Car Fire Insurance Claim: కారు ఇన్సూరెన్స్ అనగానే మనకు సాధారణంగా యాక్సిడెంట్ లేదా దొంగతనం మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ అగ్నిప్రమాదం వల్ల జరిగే నష్టం కూడా చాలా పెద్దది. వేసవి ఎండలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల కారులో మంటలు చెలరేగవచ్చు. అటువంటప్పుడు మీ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎలా అండగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ పాలసీలో ఫైర్ కవర్ ఉంటుంది?
భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ ప్రధానంగా రెండు రకాలు ఇవి.. మొదటిది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ (Third-Party): ఇది కేవలం వేరే వ్యక్తికి లేదా వారి ఆస్తికి జరిగిన నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. మీ కారుకు మంటలు అంటుకుంటే ఈ పాలసీ కింద ఒక్క రూపాయి కూడా పరిహారం రాదు. రెండోది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ (Comprehensive): ఇది పూర్తి రక్షణనిస్తుంది. ఇందులో ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు అగ్నిప్రమాదం (Fire Damage) కూడా కవర్ అవుతుంది. కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి?
కారులో మంటలు చెలరేగితే వెంటనే ఈ పనులు చేయండి:
- భద్రత: ముందుగా కారును ఆపి అందరూ సురక్షితంగా బయటకు రావాలి. అవసరమైతే ఫైర్ బ్రిగేడ్‌కు ఫోన్ చేయండి.
- పోలీస్ రిపోర్ట్: పెద్ద నష్టం జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలి.
- ఆధారాలు: కారు ఎంతవరకు కాలిపోయిందో ఫోటోలు, వీడియోలు తీయండి. ఇది క్లెయిమ్ ప్రాసెస్ లో కీలక పాత్ర పోషిస్తుంది.
- కంపెనీకి సమాచారం: వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్ప్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా సమాచారం ఇవ్వండి.
క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
మీరు సమాచారం ఇచ్చిన తర్వాత కంపెనీ ఒక సర్వేయర్‌ను పంపిస్తుంది. అతను మంటలు ఎలా అంటుకున్నాయి? ఎంత నష్టం జరిగింది అనే అంశాలను పరిశీలించి రిపోర్ట్ ఇస్తాడు. అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే కంపెనీ క్లెయిమ్‌ను మంజూరు చేస్తుంది.
అవసరమైన పత్రాలు:
- ఇన్సూరెన్స్ పాలసీ కాపీ.
- పోలీస్ లేదా ఫైర్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్.
- కారు ప్రమాద ఫోటోలు/వీడియోలు.
- కారు రిజిస్ట్రేషన్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ కాపీలు.
ఎంత డబ్బు వస్తుంది?
మీకు వచ్చే పరిహారం మీ కారు IDV (Insured Declared Value) పై ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కారు విలువ ఎంతగా నిర్ణయించారో దాన్ని బట్టి పరిహారం ఇస్తారు. అయితే కారు వయస్సును బట్టి కొంత కోత (Depreciation) ఉంటుంది. మీరు Zero Depreciation లేదా Return to Invoice వంటి యాడ్-ఆన్ కవర్లు తీసుకుంటే పూర్తి స్థాయి పరిహారం పొందే అవకాశం ఉంటుంది.
క్లెయిమ్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది?
- పాలసీ గడువు ముగిసినా లేదా ప్రీమియం చెల్లించకపోయినా.
- మీ నిర్లక్ష్యం వల్ల (ఉదాహరణకు ఇంజిన్ ఆన్ చేసి వదిలేయడం) మంటలు చెలరేగితే.
- కంపెనీ అనుమతి లేకుండా కారులో అనధికారికంగా CNG కిట్లు లేదా ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అమర్చినప్పుడు.
- కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉన్నప్పుడు.
ఇవికూడా చదవండి:
Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




