Ola, Uber: ఓలా, ఉబెర్‌లో ఫిక్స్‌డ్ ఛార్జీలు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం
నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆర్డర్‌ను తక్షణమే అమలు చేశామని, దీనిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీని ఆధారంగా ఎవరైనా ఛార్జీలు వసూలు చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవచ్చు. నగరం టాక్సీ సేవలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులను పరిష్కరించడం, అందరికీ ఒకే

క్యాబ్ సర్వీస్ ఛార్జీలు మారుతున్నాయి. సీటిలో నడిచే ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్యాబ్ సర్వీసుల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్ల కింద నడిచే సిటీ ట్యాక్సీలు, వాహనాల ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. వాహనాల ధర (క్యాబ్ ఫేర్ ఫిక్స్ డ్) ఆధారంగా నిర్ణయించిన ఈ ఛార్జీలను కర్ణాటక రవాణా శాఖ మూడు భాగాలుగా విభజించింది. కొత్త టాక్సీ ఛార్జీలపై అదనపు ఛార్జీలు ఉంటాయి. మీరు రాత్రి సమయంలో ప్రయాణం చేస్తే, అదనపు ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే పగటిపూట కంటే రాత్రి ప్రయాణానికి ఎక్కువ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఈ విధానం తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోని ఓలా-ఉబర్, ఇతర క్యాబ్‌లకు ఛార్జీ నిర్ణయించింది. అండర్ సెక్రటరీ పుష్ప నేతృత్వంలో రవాణాశాఖ వాహన ధరల ఆధారంగా ఛార్జీలను మూడు భాగాలుగా విభజించింది. కొత్త ఛార్జీ తక్షణం అమల్లోకి వచ్చాయి. ఈ ఫిక్స్‌డ్ రేట్లను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆర్డర్‌ను తక్షణమే అమలు చేశామని, దీనిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీని ఆధారంగా ఎవరైనా ఛార్జీలు వసూలు చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవచ్చు. నగరం టాక్సీ సేవలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులను పరిష్కరించడం, అందరికీ ఒకే విధమైన ఛార్జీల విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏ వాహనానికి ఎంత చార్జీ?
- రూ.10 లక్షల వరకు ఉన్న వాహనాలకు కనీస ఛార్జీ 4 కి.మీకి రూ.100. ప్రతి అదనపు కి.మీకి రూ.24.
- రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలకు కనీస ఛార్జీ 4 కి.మీకి రూ.115, ప్రతి అదనపు కి.మీకి రూ.28.
- రూ.15 లక్షలకు పైబడిన వాహనాలకు కనీస ఛార్జీ రూ.130. అదనపు కి.మీకి రూ.32.
ఇక వెయిటింగ్ ఛార్జీ విషయానికొస్తే మొదటి ఐదు నిమిషాలు ఉచితం. ఆ తర్వాత ప్రయాణికులకు ప్రతి నిమిషానికి ఒక రూపాయి ఛార్జీ చేయనున్నారు. అంతేకాకుండా యాప్ ఆధారిత అగ్రిగేటర్లు ప్రయాణికుల నుంచి ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఉదయం 12 గంటల నుంచి 6 గంటల మధ్య బుక్ చేసుకున్న క్యాబ్‌లకు ఆపరేర్లు 10 శాతం అదనంగా వసూలు చేయవచ్చు అని ఆర్డర్‌లో పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








