Sukanya: నెలకు రూ. 5 వేలు పెడితే.. చేతికి రూ. 25 లక్షల ఆదాయం.. అదిరిపోయే ఈ స్కీమ్‌పై ఓ లుక్కేయండి.

కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆడ పిల్లల పెళ్లికి లేదా వారి పై చదువుకు ఉపయోగపడేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు. రిస్క్‌ తక్కువ ఉండడం, నెలవారీగా కొంత మొత్తంలోనే పెట్టుబడి...

Sukanya: నెలకు రూ. 5 వేలు పెడితే.. చేతికి రూ. 25 లక్షల ఆదాయం.. అదిరిపోయే ఈ స్కీమ్‌పై ఓ లుక్కేయండి.
Sukanya
Follow us
Narender Vaitla

|

Updated on: May 26, 2023 | 4:18 PM

కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆడ పిల్లల పెళ్లికి లేదా వారి పై చదువుకు ఉపయోగపడేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు. రిస్క్‌ తక్కువ ఉండడం, నెలవారీగా కొంత మొత్తంలోనే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ పథకానికి మొగ్గుచూపుతున్నారు. సాధారణంగా ఈ పథకంలో ఆడబిడ్డ 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఆ అకౌంట్ హోల్డర్‌కు 18 ఏళ్ల వయసు వచ్చే సరికి మెచ్యూరిటీ అమౌంట్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక 21 ఏళ్లు వచ్చే సరికి మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో మంచి పథకాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు.

ప్రస్తుతం సుకన్య సమృద్ధిలో పెట్టుబడికి 8 శాతం వడ్డీని అందిస్తున్నారు. ప్రతీ త్రైమాసికానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇక ఈ పథకం గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు ఈ అవకాశం ఉంటుంది. ఇక పాప పుట్టిన వెంటనే ఈ సుకన్య సమృద్ధిలో చేరితే 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆమెకు అప్పటికి 14 ఏళ్లు నిండుతాయి. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం మీ ఇష్టం ఉన్నంత కట్టుకోవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకులో రూ. 205తో అకౌంట్‌ను ఓపెన్‌ చేయొచ్చు.

ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడుతూ పోతే.. చేతికి రూ. 25 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. ఏటా మీరు రూ. 60 వేలు కట్టారనుకోండి మొత్తం 15 ఏళ్ల లెక్కన మీరు రూ. 9 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఏటా 15 ఏళ్ల వరకు కడితే.. పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి చేతికి మొత్తం రూ. 25 లక్షలు అందుతాయి. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగానే, ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే ఈ మొత్తం మరింత మెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?