LIC Scheme: ఆ ఎల్ఐసీ పథకంలో పెట్టుబడితో నెలనెలా రూ.12 వేలు పెన్షన్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేస్తూ ఉంటారు. వారి డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా గొప్ప రాబడిని పొందే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది భవిష్యత్‌ను ఆలోచించి రిటైర్మెంట్ ప్లాన్‌గా స్కీమ్‌లను ఎంచుకుంటారు. అందులో పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందే ప్లాన్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నెలనెలా నిర్ణీత ఆదాయం వస్తే ఎవరిపైనా ఆధారపడాల్సిన ఉండదని భావిస్తూ ఉంటారు.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేస్తూ ఉంటారు. వారి డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా గొప్ప రాబడిని పొందే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది భవిష్యత్‌ను ఆలోచించి రిటైర్మెంట్ ప్లాన్‌గా స్కీమ్‌లను ఎంచుకుంటారు. అందులో పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందే ప్లాన్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నెలనెలా నిర్ణీత ఆదాయం వస్తే ఎవరిపైనా ఆధారపడాల్సిన ఉండదని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రత్యేక పాలసీను తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ ఈ నేపథ్యంలో ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ మీకు జీవితాంతం పెన్షన్ అందిస్తారు. ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ రిటైర్మెంట్ ప్లాన్‌గా బాగా పాపులర్ కావడానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రతి నెలా ఫిక్స్‌డ్ పెన్షన్ ఇచ్చే ఈ పథకం పదవీ విరమణ తర్వాత పెట్టుబడి ప్రణాళికలో సరిగ్గా సరిపోతుంది. ఎవరైనా ఇటీవల పదవీ విరమణ చేశారనుకుంటే పదవీ విరమణ సమయంలో పీఎఫ్ ఫండ్, గ్రాట్యుటీ నుంచి పొందిన డబ్బును అందులో పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెలా పెన్షన్ ప్రయోజనం పొందుతూనే ఉంటాడు.
రూ.12 వేలు పెన్షన్ ఇలా
ఎల్‌ఐసి సరళ పెన్షన్ ప్లాన్‌లో మీరు సంవత్సరానికి కనీసం రూ. 12,000 యాన్యుటీని పొందవచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్‌లో గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితిని నిర్ణయించలేదు. అంటే మీరు మీకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడి ప్రకారం పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో, ఏ వ్యక్తి అయినా ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఈ మొత్తం పెట్టుబడితో అతను యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఎల్ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం ఎవరైనా 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల వార్షికాన్ని కొనుగోలు చేస్తే, అతను ప్రతి నెలా రూ.12,388 పెన్షన్‌గా పొందుతాడు. కాబట్టి ఈ పథకాన్ని భార్యాభర్తలు కలిసి ప్లాన్ చేసుకుంటే మంచి లాభాలువస్తాయి.
ఎల్ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్‌ను 40 నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి కొనుగోలు చేయవచ్చు. మీరు ఒంటరిగా లేదా భార్యాభర్తలు కలిసి ఈ పథకాన్ని తీసుకోవచ్చు. ఇందులో పాలసీ ప్రారంభించిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేసుకునే వెసులుబాటు కూడా పాలసీదారునికి ఇచ్చారు. అలాగే మరణ ప్రయోజనం విషయంలో పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి మొత్తం అతని నామినీకి తిరిగి ఇస్తారు. వారికి కూడా జీవితకాల పెన్షన్, రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. జీవితాంతం పెన్షన్‌కు హామీ ఇచ్చే ఈ ఎల్‌ఐసీ పథకంలో పాలసీదారుకు రుణ సౌకర్యం కూడా కల్పించారు. సరల్ పెన్షన్ పథకం కింద పాలసీదారులు ఆరు నెలల తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మీరు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి