Portable AC: ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా చల్ల.. చల్లగా.! తక్కువ కరెంట్ ఖర్చుతో.. చౌకైన ధరలో.!
అన్-సీజనల్ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎలాంటి ఉపశమనం లేకుండాపోయింది. ఎండ వేడికి, ఉక్కపోతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే ఏసీ, కూలర్‌ల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి.
వేసవి వచ్చిందంటే చాలు.. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూపోతాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 42కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అన్-సీజనల్ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎలాంటి ఉపశమనం లేకుండాపోయింది. ఎండ వేడికి, ఉక్కపోతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే ఏసీ, కూలర్‌ల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. ఒకవేళ వీటిని తీసుకున్నా కూడా కరెంట్ బిల్లు తడిసిమోపెడవుతుంది. ఇలాంటప్పుడే తక్కువ కరెంట్ ఖర్చుతో.. మీ ఇల్లంతటిని చల్లబరిచేందుకు పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు, ఎక్కడికైనా ఈజీగా తీసుకుని వెళ్లొచ్చు. లంచ్ బాక్స్ మాదిరిగా దీని బరువు కూడా తక్కువే. మరి ఆ పోర్టబుల్ ఏసీ ఏంటి.? దాని ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఈ పోర్టబుల్ ఏసీ ప్రముఖ ఈ-కామర్స్ అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,999 కాగా.. 55 శాతం తగ్గింపుతో రూ. 900కే లభిస్తోంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సుమారు 4 గంటల వరకు పని చేస్తుంది. ఈ పోర్టబుల్ ఏసీ వాటర్ ట్యాంక్‌లో ఐస్ వాటర్ పోసి.. మీ కావాల్సిన స్పీడ్‌కు తగ్గట్టుగా ఫ్యాన్‌ను మార్చుకుని.. స్విచ్ నొక్కితే చాలు.. క్షణాల్లో మీ చుట్టూ ఉన్న వేడి గాలి.. చల్లగాలిగా మార్చేస్తుంది. ఈ ఎయిర్ కూలర్ 3 ఫ్యాన్ స్పీడ్స్‌తో డిజైన్ చేయబడగా.. దానికి ఉండే ఎల్‌ఈడీ లైట్.. రాత్రివేళ 7 రంగుల్లో వెలుగుతుంది. యూఎస్‌బీ కేబుల్ కనెక్ట్‌తో వస్తోన్న ఈ పోర్టబుల్ ఏసీ.. తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. అలాగే దీని వాటర్ ట్యాంక్‌ను ఒక్కసారి నింపితే.. 4 గంటల వరకు ఆ నీటిని వినియోగించుకోవచ్చు. అటు 58 డిసిబుల్స్ కంటే తక్కువ సౌండ్‌ను ఇచ్చే ఈ పోర్టబుల్ ఏసీని మీరు కిచెన్, బెడ్ రూమ్, స్టడీ రూమ్, లేదా బయటకు పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు కూడా వాడుకోవచ్చు.