అదిరిపోయే ఆఫర్.. రూ. 9 లక్షల కారు కేవలం రూ. 2.70 లక్షలకే.. 18 నెలల తర్వాత నచ్చకుంటే డబ్బు వాపస్!

మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా.? ధరలు మరీ మండిపోతున్నాయని భావిస్తున్నారా.? అయితే టెన్షన్ పడకండి.! తక్కువ ధరలో అధునాతన..

  • Updated On - 7:23 pm, Thu, 22 July 21
అదిరిపోయే ఆఫర్.. రూ. 9 లక్షల కారు కేవలం రూ. 2.70 లక్షలకే.. 18 నెలల తర్వాత నచ్చకుంటే డబ్బు వాపస్!
Hyundai

మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా.? ధరలు మరీ మండిపోతున్నాయని భావిస్తున్నారా.? అయితే టెన్షన్ పడకండి.! తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు ఉండే కారును కొనొచ్చు. సుమారు రూ. 9 లక్షలు విలువైన కారును కేవలం రూ. 2.70 లక్షలకే మీసొంతం చేసుకోవచ్చు. అదే హ్యుందాయ్ ఐ20(Hyundai i20). ఆన్‌లైన్ వెబ్‌సైట్ స్పిన్నీ(Spinny) ద్వారా మీరు దీన్ని పొందవచ్చు.

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు, అమ్మకాలు జరిగే వెబ్‌సైట్ స్పిన్నీ(Spinny). ఇందులో 2011 మోడల్ హ్యుందాయ్ ఐ20 ఆస్టా 1.2 కారు ఫస్ట్ ఓనర్ ద్వారా అమ్మకానికి వచ్చింది. పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో వచ్చే ఈ కారు ఫిక్స్‌డ్ ధర రూ. 2.70 లక్షలు. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఆ కారు 91,142 కిలోమీటర్లు తిరిగింది. దీని ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ నవంబర్ 2021 వరకు ఉంది. అటు కారు లోపల భాగంలో చిన్న సొట్టలు.. పైభాగంలో పలు గీతలు ఉన్నాయి. మీరు ఈ కారు గురించి మరింత సమాచారాన్ని కింద పేర్కొన్న లింక్‌లో పొందవచ్చు (https://www.spinny.com/buy-used-cars/delhi/hyundai/i20/asta-12-netaji-subhash-place-2011/631660/).

EMIలో కొనుగోలు చేయవచ్చు…

మీరు ఈ కారును కొనుగోలు చేసినప్పుడు, ఒక సంవత్సరం ఉచిత వారెంటీని పొందుతారు. అలాగే ఐదు రోజుల మనీబ్యాక్ గ్యారెంటీని కూడా. అటు ఈ కారును 12.5% ​​వడ్డీ రేటుతో ఐదేళ్ల రుణంపై తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు ప్రతి నెలా రూ. 4,804 చెల్లించాలి. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం కేవలం 10 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ కారును మీరు పొందవచ్చు. ఉచిత టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు.

ఇక కారు నచ్చకపోతే.. 6 నెలల డ్రైవింగ్ తర్వాత తిరిగి ఇచ్చేయొచ్చు..

వినియోగదారుడికి ఈ కారుతో బైబ్యాక్ సదుపాయాన్ని స్పిన్నీ అందిస్తోంది. ఇక బైబ్యాక్ పీరియడ్ 6 నెలల నుండి 18 నెలల వరకు ఉంటుందని నిర్ధారించింది. మీరు ఈ కారును 18 నెలలు నడిపిన తరువాత, తిరిగి ఇచ్చినట్లయితే 1,83,000 రూపాయలు పొందవచ్చు.

Disclaimer: ఈ వార్త కేవలం సదరు వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా ప్రచురితమైనది మాత్రం. వాటితో టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని మనవి.

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!