Business Ideas: పది మందికి ఉపాధి ఇస్తూ.. లక్షల సంపాదన! ఈ బిజినెస్‌తో మీ ఫ్యామిలీ స్టేటస్ మొత్తం మారిపోతుంది!
చిన్న చిన్న వ్యాపారాలు కాకుండా ఒక మంచి పెట్టుబడితో, మరో పది మందికి ఉపాధి ఇచ్చేలా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే డెయిరీ ఫామ్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కాస్త పొలం ఉన్న వారికి అయితే ఇంత మరింత అనుకూలమైన బిజినెస్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వ్యాపారంలో ఉండే డబ్బు మరే రంగంలో కూడా ఉండదు. అందుకే చాలా మంది మంచి వ్యాపారం ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేసి జీవితంలో స్థిరపడాలని అనుకుంటారు. అయితే ఏ బిజినెస్ చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలనే విషయాల్లో అవగాహన లేక ఆగిపోతుంటారు. అయితే ఇప్పుడు మంచి బిజినెస్ ఐడియాతో పాటు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, పెట్టుబడి ఎలా పొందాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చిన్న చిన్న వ్యాపారాలు కాకుండా ఒక మంచి పెట్టుబడితో, మరో పది మందికి ఉపాధి ఇచ్చేలా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే డెయిరీ ఫామ్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కాస్త పొలం ఉన్న వారికి అయితే ఇంత మరింత అనుకూలమైన బిజినెస్. తక్కువ భూమితో వ్యవసాయం చేస్తే అంత గిట్టుబాటు కాకపోవచ్చు. కానీ అదే తక్కువ భూమిలో ఓ షెడ్ వేసి, మిగిలిన భూమిలో గేదెలకు మేత పెంచితే ఒక వ్యాపారం సామ్రాజ్యాన్నే నిర్మించవచ్చు.
ఓ రూ.5 లక్షలతో షెడ్‌తో పాటు డెయిరీకి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. మరో రూ.5 లక్షలతో మంచి మేలు రకం జాతి గేదెలను కొనుగోలు చేయాలి. అలాగే పనివాళ్లను కూడా పెట్టుకోవాలి. మొత్తంగా ఓ రూ.10 లక్షల బేస్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ డెయిరీ ఫామ్‌ను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం పాలకు, పాల ఉత్పత్తులకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రారంభంలో పాలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించి, ఆ తర్వాత వ్యాపారం అభివృద్ధి సొంతంగా మీరే ఒక డెయిరీ బ్రాండ్‌ను క్రియేట్ చేయవచ్చు. ఇందులో అంత స్కోప్ ఉంది. పైగా ఇలాంటి వ్యవసాయ అనుబంధం వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇచ్చి ప్రొత్సహిస్తోంది. ముద్ర లోన్లు తీసుకొని ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




