Bumper Offer: బంపర్‌ ఆఫర్‌.. 8 లక్షల కారు కేవలం రూ.2.59 లక్షలకే..

ఈ రోజుల్లో బైక్‌లు ఉన్నవారు కూడా కారు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. వారి వార్షిక ఆదాయం పెద్దగా లేకున్నా.. కారు కొనాలని భావిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అయితే ఈ రోజుల్లో కొత్త కారు కొనుగోలు చేసేబదులు సెకండ్‌ హ్యాండ్‌ కారు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కరెట్లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కుప్పలు తెప్పలుగా లభిస్తున్నాయి. అతి తక్కువ ధరల్లోనే సెకండ్‌ హ్యాండ్‌ కార్లు లభిస్తున్నాయి..

Bumper Offer: బంపర్‌ ఆఫర్‌.. 8 లక్షల కారు కేవలం రూ.2.59 లక్షలకే..
Hyundai I10
Follow us
Subhash Goud

|

Updated on: Feb 21, 2024 | 4:32 PM

ప్రస్తుతం మార్కెట్లో కార్లది హవా కొనసాగుతోంది. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల కార్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే సరికొత్త ఫీచర్స్‌తో వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే ఈ రోజుల్లో బైక్‌లు ఉన్నవారు కూడా కారు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. వారి వార్షిక ఆదాయం పెద్దగా లేకున్నా.. కారు కొనాలని భావిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అయితే ఈ రోజుల్లో కొత్త కారు కొనుగోలు చేసేబదులు సెకండ్‌ హ్యాండ్‌ కారు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కరెట్లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కుప్పలు తెప్పలుగా లభిస్తున్నాయి. అతి తక్కువ ధరల్లోనే సెకండ్‌ హ్యాండ్‌ కార్లు లభిస్తున్నాయి. అయితే ప్రముఖ సెకండ్‌ హ్యాండ్‌ కార్లు లభించే ప్లాట్ ఫాం Cars 24. ఇందులో మీకు నచ్చిన కార్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఓ కారు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంది.

Hyundai i10 కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.5.92 లక్షల నుంచి రూ.8.56 లక్షలు ఉంది. కానీ సెకండ్‌ హ్యాండ్‌లో కార్స్‌ 24లో కేవలం రూ.2.59 లక్షలకే లభిస్తుంది. ఈ కారు 2011 సంవత్సరానికి చెందిన మోడల్‌. పెట్రోల్‌ వెర్షెన్‌ కారు. ఇప్పటి వరకు ఈ కారు 67,148 కిలోమీటర్లు తిరిగింది. దీని రిజిస్ట్రేషన్‌ 2012లో జరిగింది.

సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటే తెలుసుకోవాల్సిన విషయాలు

ఇవి కూడా చదవండి

కారు కొనుగోలు చేసేటప్పుడు దాన్ని లోపల, బయట క్షుణ్ణంగా పరిశీలించాలి. తుప్పు, డెంట్‌లు, సరిపోలని పెయింట్‌వర్క్ లాంటివి ఏమైనా ఉన్నయోమో చెక్ చేసుకోవాలి. లైట్లు, కిటికీలు, లాక్ వంటి అన్ని ఫీచర్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. టెస్ట్ డ్రైవ్ కు వెళ్లండి. కారు ఎలా వెళుతుంది.. ఏవైనా శబ్ధాలు వస్తున్నాయా, వైబ్రేషన్స్ వస్తున్నాయా అనే విషయాలు తెలుసుకోవచ్చు. మీకు డ్రైవింగ్‌ గురించి పెద్దగా అనుభవం లేకపోతే అనుభవం ఉన్న వారిని తీసుకెళ్లడం ఉత్తమం. ఇవన్ని కూడా చెక్ చేసిన తరువాత కూడా ఇంకా కనిపించని చాలా సమస్యలు ఉంటాయి. మెకానిక్ ను పిలిపించి కూడా చెక్ చేయించుకోవాలి.

మీకు అన్ని విధాలుగా నచ్చింది అనుకుంటే యజమానితో ధర గురించి మాట్లాడండి. మార్కెట్ రేట్లను సరిపోల్చుకున్న తరువాతే కొనుగోలు చేయడం అవసరం. ఇక కొనే ముందు రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా సర్టిఫికేట్లు వంటి అన్ని అవసరమైన పత్రాలను చెక్ చేయడం మర్చిపోవద్దు. కారు కొన్న తరువాత యాజమాన్యం బదిలీకి సంబంధించిన అన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేయండి. సేల్ డీడ్, ట్రాన్స్‌ఫర్ ఫారమ్‌లు మొదలైన అన్ని అవసరమైన డాక్యూమెంట్లు ఎటువంటి తప్పులు తేకుండా ఉండి ఇరుపక్షాల వారు సంతకాలు చేసి ఉండాలి. ఇక కారు కొన్నాక దానికి రెగ్యూలర్ గా సర్వీస్ చేయిస్తుంటే కారు మంచి కండీషన్ లో ఉంటుంది.

నోట్‌: ఈ సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనుగోలు చేసే ముందు సదరు వాహనానికి సంబంధించిన యజమానిని కలవకుండా, కారు కండీషన్ చెక్ చేయకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. ఈ విషయాన్ని కస్టమర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

Source

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి